ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ కాబోతున్న జెఫ్ బెజోస్, ఆ తర్వాత ముకేష్ అంబానీ

కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 08:11 AM IST
ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ కాబోతున్న జెఫ్ బెజోస్, ఆ తర్వాత ముకేష్ అంబానీ

కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.

కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇక ప్రపంచ కుబేరులపైనా కరోనా ప్రభావం చూపింది. పలువురి ఆస్తులు తరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కుబేరులంతా లక్షల కోట్లు కోల్పోతుంటే.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(62) మాత్రం కరోనా కారణంగా మరింత పైకి వెళ్తున్నాడు. కరోనా కారణంగా అమెజాన్ సంస్థకు చెందిన సర్వీసులపై ఆధారపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అమెజాన్ సంస్థల నికర ఆస్తుల విలువ అమాంతం పెరుగుతూ పోతోంది. 

పెరుగుతూనే ఉన్న బెజోస్ ఆస్తుల విలువ:
2017 నుంచి ఇప్పటివరకు జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోనే కొనసాగుతూ వస్తున్నాడు. ఏప్రిల్ 12న 125 బిలియన్ డాలర్లుగా ఉన్న జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం 143 బిలియన్ డాలర్లకు చేరింది. నెల రోజుల్లోనే దాదాపు 20 బిలియన్ డాలర్ల నికర ఆస్తుల విలువ పెరిగింది. ఇదిలా ఉండగా.. అమెరికాకు చెందిన కంపారిసన్(comparisun) అనే బిజినెస్ అడ్వైజ్ ప్లాట్‌ఫామ్ న్యూయార్క్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌లోని 25 హై వాల్యూడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అనలైజ్ చేసింది. ఆయా కంపెనీల గత ఐదేళ్ల అభివృద్ధిని రానున్న ఐదేళ్లతో పోల్చి చూసింది. 

2026 నాటికి ట్రిలియన్ డాలర్లు:
ఈ లెక్కల బట్టి జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 2026 సంవత్సరానికి ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. 179 దేశాల జీడీపీ కంటే జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువే ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయిన ఘనతను జెఫ్ బెజోస్ దక్కించుకోనున్నాడు.

2033లో ట్రిలియనీర్ కానున్న అంబానీ:
ఇక ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ బెజోస్ కంటే దాదాపు ఒక దశాబ్దం తర్వాత ట్రిలియనీర్ హోదా పొందగలడని సంస్థ అంచనా వేసింది. జుకర్‌బర్గ్ ప్రస్తుత రేటు పెరుగుదల విలువ 1 ట్రిలియన్ డాలర్లు. అప్పటికి అతడి వయసు కేవలం 51 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక భారత దేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ 2033లో 75 ఏళ్ల వయసులో ట్రిలియనీర్ అవ్వగలడని కంపారిజన్ సంస్థ చెబుతోంది. చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జు జియాయిన్ 2027 లో ప్రపంచంలో రెండవ ట్రిలియనీర్‌గా అవతరించడానికి బెజోస్‌ను అనుసరిస్తాడంది.

అలీబాబా యొక్క జాక్ మా 2030 లో ట్రిలియనీర్ కావచ్చని అంచనా. అప్పటికి అతడి వయసు 65 సంవత్సరాలు. సంస్థ విశ్లేషించిన 25మంది వ్యక్తుల్లో పదకొండు మందికి మాత్రమే వారి జీవితకాలంలో ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఇటీవలి సంపద వృద్ధి రేటు ఆధారంగా.

ట్రిలియనీర్లు అయ్యే వారి జాబితాలో ఉన్న ఇతర వ్యక్తులు
* టెన్సెంట్ హోల్డింగ్స్ ఛైర్మన్, CEO మా హువాటెంగ్
* బెర్నార్డ్ ఆర్నాల్ట్, మోయిట్ హెన్నెస్సీ పేరెంట్ LVMH CEO
* మాజీ మైక్రోసాఫ్ట్ CEO స్టీవ్ బాల్మెర్
* డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్
* గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్.

Read Here>> విమానాల్లో పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌ లకు కొత్త డ్రెస్సులు..