Jet pack : అమెరికా గగనతలంలో సంచరిస్తున్న జెట్ ప్యాక్ మనుషులు

ప్రస్తుతం తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనతో అమెరికా ఎఫ్ బీ ఐ అప్రమత్తం అయ్యింది. ఇలాంటి వారు ఎక్కడైనా గగనతలంలో కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ణప్తి చేసింది.

Jet pack : అమెరికా గగనతలంలో సంచరిస్తున్న జెట్ ప్యాక్ మనుషులు

Jet Pack

Jet pack : అకాశంలో ఎగిరే పక్షులను చూసినప్పుడల్లా చాలా మంది తాముకూడా రెక్కలు కట్టుకుని ఏంచక్కా నింగిలో ఎగురుతుంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారు…అయితే కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ప్రస్తుతం అలాంటి కలను నిజం చేస్తోంది. అకాశంలో స్వేచ్చగా విహరించే జెట్ ప్యాక్ టెక్నాలజీ అందుబాటులోకి రావంతో కొందరు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని అకాశంలో విహరిస్తున్నారు.

ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో జెట్ ప్యాక్ మనుషులు అకాశంలో వేల అడుగుల ఎత్తులో విహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా సాంకేతిక పరిజ్జానం దుర్వినియోగం అవుతుండటంపై అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. ఇప్పటికే ఇలా నాలుగు పర్యాయాలు అమెరికాలోని గగనతలంలో జెట్ ప్యాక్ మనుషులు విహరించిన సంఘటనలు వెలుగుచూశాయి.

అయితే తాజాగా లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలోని గగనతలంలో జెట్ ప్యాక్ ధరించిన మనిషి అకాశంలో విహరిస్తుండటాన్ని బోయింగ్ 747 విమానం నడుపుతున్న పైలట్ గుర్తించాడు. ఎయిర్ పోర్టుకు 15 మైళ్ళ దూరంలో ఐదువేల అడుగుల ఎత్తులో జెట్ ప్యాక్ మనిషిని తాను చూసినట్లు ఎయిర్ పోర్టు అధికారికి రిపోర్ట్ చేశాడు.

విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పైలట్ ఇచ్చిన సమాచారంతో ఎయిర్ పోర్టు అధారిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారాన్ని ఇతర పైలట్లకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా అందించారు. విమానాలు ల్యాండింగ్ అయ్యే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ప్రస్తుతం ఈ వ్యహారం అమెరికాలో కలకలం సృష్టిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా టెక్నాలజీని వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన మొదలైంది.

జెట్ మ్యాన్ ప్యాక్ ధరించి అకాశంలో సంచరించటం గతంలో అనేక చోట్ల వెలుగు చూశాయి. అప్పట్లో దీనిని ఉత్తుత్తి ప్రచారంగానే భావించినా 2020 ఆగస్టులో అమెరికన్ ఎయిర్ లైన్స్ పైలట్ మూడు వేల అడుగుల ఎత్తులో జెట్ ప్యామ్ మనిషిని చూశానని చెప్పాడు. అదే తరహాలో అక్టోబరులో చైనా ఎయిర్ లైన్స్ పైలట్ 6వేల అడుగుల ఎత్తులో జెట్ ప్యాక్ మ్యాన్ ను చూశానని వెల్లడించాడు. కొద్ది నెలల క్రితం 300 యార్డ్ ల దూరంలో జెట్ ప్యాక్ మనిషిని చూసినట్లు అమెరికన్ ఎయిర్ లైన్ పైలట్ చెప్పటంతోపాటు, దీనికి సంబంధించిన ఒక ఫుటేజిని రిలీజ్ చేయటంతో ఇది వాస్తమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో అమెరికా దర్యాప్తు సంస్ధ సైతం దీనిని నిర్ధారించింది.

ప్రస్తుతం తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనతో అమెరికా ఎఫ్ బీ ఐ అప్రమత్తం అయ్యింది. ఇలాంటి వారు ఎక్కడైనా గగనతలంలో కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ణప్తి చేసింది. మరోవైపు జెట్ ప్యాక్ సాయంతో వేల అడుగుల ఎత్తుకు వెళ్ళటం ఎలా సాధ్యమన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పలు దేశాల్లో జెట్ ప్యాక్ తయారీ సామర్ధ్యం ఉన్న కంపెనీలు ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు లైసెన్స్ కలిగి ఉండాలి.

ఇదిలావుంటే జెట్ ప్యాక్ తో 1500 అడుగుల ఎత్తుమాత్రమే ఎగిరేందుకు అవకాశం ఉంటుందని..అంతకు మించి పైకి వెళితే అందులోని ఇంధన సమస్యలు ఏర్పడతాయని కాలిఫోర్నియాకు చెందిన జెట్ ప్యాక్ ఏవియేషన్ కంపెనీ సిఈవో డేవిడ్ మయన్ చెబుతున్నాడు. అయితే జెట్ మన్ దుబాయ్ ఏవియేషన్ సంస్ధ గత ఏడాది ఫ్రిబ్రవరిలో పైలెట్ విన్స్ రెఫెట్ ద్వారా ఆరు వేల అడుగుల ఎత్తులో విహరించే జెట్ ప్యాక్ ప్రయోగించి విఫలమైంది. ఆఘటనలో పైకి వెళ్ళిన రెఫట్ పారాషూట్ సాయంతో సేఫ్ గా ల్యాండ్ అవ్వటంతో ప్రాణాలు నిలిచాయి. అనంతరం కొద్ది మాసాల తరువాత రఫెట్ మరో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

జెట్ ప్యాక్ మనుషుల విహారంతో అమెరికా ఎఫ్ బి ఐ అప్రమత్తమైంది. దీనిని సీరియస్ గా తీసుకున్న ఎఫ్ బి ఐ ఇలాంటి వాటి వల్ల దేశభధ్రతకు ముప్పు వాటిల్లటంతోపాటు, పొరపాటున గగనతలంలో జెట ప్యాక్ మనుషులు విమానాలకు ఢీకొడితే పెద్ద దుర్ఘటనలు చోటు చేసుకుంటాయన్న ఆందోళన వ్యక్తమౌతుంది. ఈతరహా టెన్నాలజీపై పూర్తిస్ధాయిలో నియంత్రణకు చర్యలు చేపడుతుంది. అనుమతి లేకుండా వేల అడుగుల ఎత్తులోకి విహరించటం తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.