అత్యంత దారుణం..డ్రగ్స్ ఇచ్చి..సూదులతో గుచ్చి యువతిపై నెల రోజులుగా 60 మంది అత్యాచారం..!

అత్యంత దారుణం..డ్రగ్స్ ఇచ్చి..సూదులతో గుచ్చి యువతిపై నెల రోజులుగా 60 మంది అత్యాచారం..!

60 mens gang raped girl for a month : దేశంలో ఆడపుట్టులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఏమాత్రం ఆగటంలేదు. ప్రతీ క్షణం భయంతో బతకాల్సిన పరిస్థితుల్లో ఆడపిల్లలకు కనాలంటేనే భయపడే దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో ఝార్ఖండ్ లో అత్యంత పాశవికంగా ఓ యువతిని నెల రోజుల నుంచి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60మంది అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..!!

యువతిని ఓ గ్యారేజీలో బంధించి నెల రోజులుగా 60మంది అత్యాచారానాకి తెగబడిన అత్యంత అమానవీయమైన ఘటనతో దేశం యావత్తు మరోసారి ఉలిక్కిపడింది.నెల రోజుల నుంచి ఆ కామాంధుల చేతిలో హింసలను అనుభవిస్తునన బిధితురాలు ఓ రోజు చాకచక్యంగా తప్పించుకోవటంతో ఈ దారుణం బైటపడింది. నెల రోజులుగా జరుగుతున్న అత్యాచారంతో బాధితురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. కామాంధుల చెరనుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయటంతో ఇది వెలుగులోకి వచ్చింది.

సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో మూతపడిన గ్యారేజీలో తనను నెల రోజులపాటు బంధించారని..60 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి తెలిపింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని, అంతకుమించిన ఆమె వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. యువతి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమాచారం అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

జంషెడ్‌పూర్‌కు చెందినట్టుగా చెప్పబడుతున్న ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి.. సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో మూతపడిన గ్యారేజ్‌లో ఇన్నాళ్లు బంధించారని..అక్కడే తనకు మత్తుమందు ఇచ్చి 60 మంది అత్యాచారం చేశారని తెలిపింది. వారి చెప్పినట్టుగా వినకపోతే హింసించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం (మార్చి 4,2021) టాయిలెట్‌ కోసం బయటకు వెళ్తానని చెప్పి వారి నుంచి తప్పించుకున్నానని సదరు యువతి చెబుతోందని పోలీసులు తెలిపారు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. యువతి ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమెను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే ఆ యువతికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. బాధిత యువతి ఇచ్చిన సమాచారం దర్యాప్తు చేస్తున్నారు. కానీ బాధితురాలు తప్పించుకున్న తరువాత తాము దొరికిపోతామనే భయంతో నిందితులు తప్పించుకున్నారేమోనని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మరోవైపు యువతి శరీరంపై సూదులతో గుచ్చిన గుర్తులు ఉన్నాయి. వాటితో పాటు పలు గాయాలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా పరిగణించి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.