Fatwa Girl Driving Tractor : ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేస్తున్న యువతికి ఫత్వా జారీ..జరిమాన కట్టకుంటే ఊరునుంచి బహిష్కిస్తామంటూ హుకుం

ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేస్తున్న యువతికి పంచాయతీ పెద్దలు ఫత్వా జారీ చేశారు..ఆడపిల్లవి ట్రాక్టర్ నడుపుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరందరికి క్షమాపణ చెప్పి జరిమాన కట్టాలని లేకుంటే ఊరునుంచి బహిష్కిస్తామంటూ హుకుం జారీ చేశారు.

Fatwa Girl Driving Tractor : ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేస్తున్న యువతికి ఫత్వా జారీ..జరిమాన కట్టకుంటే ఊరునుంచి బహిష్కిస్తామంటూ హుకుం

jharkhand girl Driving the tractor is issued panchayat fatwa

Fatwa Girl Driving Tractor : మహిళలు ఆకాశంలో గెలుపు సంతకాలు చేస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా భారత్ లోని పలు ప్రాంతాల్లో ఆడవాళ్ల పట్ల వివక్ష కొనసాగుతోంది. వ్యాపారవేత్తలుగా..డాక్టర్లు,లాయర్లుగా..ఐపీఎస్,ఐఏఎస్ లుగా మహిళలు రాణిస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా ఆడపుట్టులకపై ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు ఛాందసవాదులు.తమ ఆధిపత్యం చెలాలయించుకోవటానికి..దాన్ని కొనసాగించుకోవటానికి అర్థం పర్థం లేని ఆంక్షలతో ఆడవారిపై ఆంక్షలు..కట్టుబాట్లు విధిస్తున్నారు. కుటుంబం కోసం కష్టపడుతు..డిగ్రీ చదువుకుంటు కూడా ట్రాక్టర్ తో పొలం దున్ని వ్యవసాయం చేస్తున్న ఓ యువతిపై పంచాయితీ పెద్దలు ఆంక్షలు విధించారు. ఆడపిల్లలు ట్రాక్టర్ నడపటమా? మగవారు చేసే పనులు ఆడపిల్లలు చేయటమేంటీ? అంటూ మండిపడ్డారు. జరిమానా విధించారు. పంచాయితీకి వచ్చి క్షమాపణ చెప్పాలని లేదంటూ గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇన్ని నిర్భంధాలు విధించినా ఆ ‘ధీర’మాత్రం లెక్కచేయలేదు..ట్రాక్టర్ నడుపుతా..వ్యవసాయం చేసి చూపిస్తా..ఏం చేస్తారో చేసుకోండి అంటూ సమాధానం చెప్పింది పంచాయితీ పెద్దలకు..!!

ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా సిసాయి బ్లాక్‌లోని దహుటోలి గ్రామంలో..మంజు ఒరాన్ అనే యువతి కుటుంబానికి పెద్దగా నిలిచింది. ట్రాక్టర్ నడుపుతూ పొలం పనులు చేస్తున్న యువతిపై గ్రామస్థులు కక్షగట్టారు. మగరాయుడులా ఆమె ట్రాక్టర్ నడుపుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. పంచాయతీ పెట్టి ఆ యువతికి జరిమానా విధించారు. జరిమాన చెల్లించకపోతే గ్రామం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ పంచాయతీ పెద్దల బెదరింపులకు ఆ యువతి బెదిరిపోలేదు.

రైతు కుటుంబంలో పుట్టిన మంజు ఒరాన్..గుమ్లాలోని కార్తీక్ ఒరాన్ కాలేజీలో బీఏ పార్ట్ వన్ చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. వారికి ఆరెకరాల సాగుభూమి ఉంది. కొన్నేళ్లుగా సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్న వీరికి నీటి పారుదల సౌకర్యాలు, సరికొత్త వ్యవసాయ పద్ధతులపై ఎటువంటి అవగాహన లేదు. దీంతో మంజు సాంకేతిక సాయంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం గ్రామంలో మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. ఈ భూమిలో వరి, మొక్కజొన్న, టమాటా, బంగాళదుంప వంటి పంటల సాగులో ప్రారంభించింది. మంజు ఒరాన్ చేసిన వ్యవసాయానికి మంచి ఫలితాలు రావడంతో ఈ సంవత్సరం కూడా వ్యవసాయం మరింత సులువు కావటానికి సొంతంగా ఓ పాత ట్రాక్టర్‌ను కొని తానే స్వయంగా ట్రాక్టర్ తో పొలం దున్ని వ్యవసాయం చేస్తోంది. అలా ఆ గ్రామమే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆడపిల్లలు ట్రాక్టర్ నడపం అనేది జరుగలేదు. మంజు మాత్రమే తొలిసారిగా ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేసిన మొదటి ఆడపిల్లు. ఇది చూసి గ్రామస్థులు విస్తుపోయారు. సరికొత్త పద్ధతుల్లో సాగు ప్రారంభించిన మంజును చూసిన గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారు.ఆ అమ్మాయి చేసే వ్యవసాయం..చక్కటి ఫలితాలు రావటం చూసి ఈర్ష్యపడ్డారు. దీంతో ‘ఆడపిల్ల’ ట్రాక్టర్ నడటమేంటి? పరువుతక్కువు..ఊరికి అరిష్టం అంటూ మండిపడ్డారు. పంచాయతీ పెట్టారు. వెంటనే ట్రాక్టర్ వ్యవసాయం మానేయాలని..చేసిన పనికి ఊరందరికి క్షమాపణలు చెప్పి జరిమానా కట్టాలని..లేదంటే గ్రాహం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.

కానీ అర్థం పర్థం లేని ఇటువంటి ఆంక్షలకు బెదిరేది లేదని మంజు తెగేసి చెప్పింది. ప్రగతిశీల రైతుగానే ఉంటాను..మీ తీర్పుల్ని ఖాతరు చేసేదిలేదు..క్షమాపణ చెప్పేంత తప్పు నేను చేయలేదు..జరిమానా కట్టేదే లేదని తెగేసి చెప్పింది. భూమిని సాగు చేయడం నేరం ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించింది. తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, తన పని తాను చేసుకుంటూనే ఉంటానని తేల్చిచెప్పింది. మంజు ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.