Jignesh Mevani: తగ్గేదే లే అంటూ ‘పుష్ప’ డైలాగ్‌ చెప్పిన గుజరాత్ ఎమ్మెల్యే.. అంత ఆవేశం ఎందుకొచ్చిందంటే..

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలోని దాదాపు అన్ని భాషలో ఈ సినిమా విడుదలైంది. దేశవ్యాప్తంగా ఎక్కడ...

Jignesh Mevani: తగ్గేదే లే అంటూ ‘పుష్ప’ డైలాగ్‌ చెప్పిన గుజరాత్ ఎమ్మెల్యే.. అంత ఆవేశం ఎందుకొచ్చిందంటే..

Jignesh

Jignesh Mevani: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలోని దాదాపు అన్ని భాషలో ఈ సినిమా విడుదలైంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన అన్నివర్గాల ప్రజల నుంచి ‘తగ్గేదే లే’ అన్న డైలాగ్ ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేహానీ తగ్గేదేలే అంటూ పుష్ప చిత్రలోని డైలాగ్ ను హిందీలో చెబుతూ హీరో అల్లు అర్జున్ మ్యానరిజం ప్రదర్శించారు. అంతేకాక తన ట్విటర్ అకౌంట్ లోనూ అల్లు అర్జున్ డైలాగ్ జిఫ్ ను పోస్టు చేశారు. ఇంతకీ జిగ్నేశ్ మేహానీకి అంత ఆవేశం ఎందుకొచ్చిందంటే..

మహిళా పోలీసు అధికారిపై దాడి చేశారన్న ఆరోపణల కేసులో జిగ్నేశ్ మేహానీని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అయితే శుక్రవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసుల వైఖరిని కోర్టు తప్పుబట్టింది. బెయిల్ పై శుక్రవారం సాయంత్రం స్టేషన్ నుంచి జిగ్నేశ్ బయటకొచ్చాడు. ఈ సందర్భంగా జుకేగే న‌హీ (తగ్గేదే లే) అంటూ పుష్ప డైలాగ్ చెబుతూ సినిమాలో హీరో తరహాలో స్టైల్ ను ప్రదర్శించారు. అనంతరం జిగ్నేశ్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బీజేపీ మహిళను అడ్డుపెట్టుకుని నాపై అక్రమ కేసు బనాయిస్తోందని ఆరోపించారు. నా అరెస్ట్ మామూలు విషయం కాదని, పీఎంవోలోని రాజకీయ పెద్దల సూచనల మేరకే ఇది జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. మత ఘర్షణలు, అల్లర్లు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేగా శాంతిభద్రతలను కాపాడాల్సిన హక్కు నాకు లేదా అంటూ ప్రశ్నించారు. అది నా కర్తవ్యమని, కానీ అదే తప్పన్నట్లు తనను అరెస్టు చేశారని మేవానీ తెలిపారు.

Sri lanka crisis: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ఔట్? ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు..

ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీ ఇలా చేస్తోందని ఆరోపించారు. తన అరెస్టు సమయంలో మద్దతు ఇచ్చిన అస్సాం ప్రజలకు, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోంలో ఎక్కడో అరెస్ట్ చేసి కేసులు బనాయించి బయటకు రాకుండా చూడాలన్నది బీజేపీ కుట్ర అన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ నన్నుకూడా టార్గెట్ చేశారని ఆరోపించారు. దళితులు, గుజరాత్ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని జిగ్నేశ్ హెచ్చరించారు.