Jio 5G Services : మీకు Jio 5G అందుబాటులో ఉన్నా కనెక్ట్ చేసుకోలేకపోతున్నారా? మీరు తప్పక చేయాల్సిన పనులు ఇవే..!

Jio 5G Services : ప్రముఖ టెలికం దిగ్గజం Reliance Jio కంపెనీ దేశంలో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో 5G సర్వీసులు 5 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, వారణాసి ఉన్నాయి.

Jio 5G Services : మీకు Jio 5G అందుబాటులో ఉన్నా కనెక్ట్ చేసుకోలేకపోతున్నారా? మీరు తప్పక చేయాల్సిన పనులు ఇవే..!

Jio 5G available in your area but you still can't use it here is what you need to do

Jio 5G Services : ప్రముఖ టెలికం దిగ్గజం Reliance Jio కంపెనీ దేశంలో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో 5G సర్వీసులు 5 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, వారణాసి ఉన్నాయి. టెలికాం ఆపరేటర్ ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని నగరాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నాటికి భారత్‌లోని ప్రధాన నగరాల్లో 5G కనెక్టివిటీని అందిస్తుంది. 5G రెడీ స్మార్ట్‌ఫోన్లను కలిగిన Jio యూజర్లు వారి ప్రాంతంలో నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 5G కోసం ఇన్విటేషన్ అందుకుంటారు. 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లందరకు ఈ జియో ఆహ్వానాన్ని పొందలేరని గమనించాలి. Jio 5G ఇన్విటేషన్ పొందడానికి వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్ మోడల్, యాక్టివ్ Jio ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో సహా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీ ఫోన్‌లో Jio 5G కనెక్టివిటీని పొందడానికి అవసరమైన అన్ని ఉన్నాయో లేదో ఇప్పుడు చూద్దాం..

Jio 5G invite plan :
అధికారిక సైట్‌లో Jio యూజర్లందరూ తమ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయవచ్చునని Jio పేర్కొంది. ప్రస్తుత 4G SIM 5G కనెక్టివిటీకి కూడా సపోర్టు అందిస్తుంది. యూజర్లు ప్రత్యేక 5G SIM కొనుగోలు చేయవలసిన అవసరం లేదని గమనించాలి. మీరు 5G సపోర్టు ఉన్న ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి. రూ. 239, అంతకంటే ఎక్కువ యాక్టివ్ ప్లాన్‌ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. 5G ఇన్విటేషన్ యూజర్ల కోసం Jio ఎలాంటి ప్రత్యేకమైన 5G ప్లాన్‌లను ప్రవేశపెట్టలేదు.

Jio 5G available in your area but you still can't use it here is what you need to do

Jio 5G available in your area but you still can’t use it here is what you need to do

కనీసం రూ. 239 ప్లాన్‌తో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్‌ను ఉపయోగిస్తున్న జియో యూజర్లు Jio 5G వెల్‌కమ్ ఆఫర్ బెనిఫిట్స్ పొందవచ్చు. వెల్‌కమ్ ఆఫర్ కింద.. జియో యూజర్లు యాక్టివ్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ 5G డేటాను పొందుతారు. ఆసక్తికరంగా 598.58 Mbps వరకు వేగవంతమైన 5G నెట్‌వర్క్ స్పీడ్‌ను అందించడానికి Jio టెస్టింగ్ అందిస్తోంది. Jio 5G యూజర్లు హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. వారి యాక్టివ్ బేస్ ప్లాన్‌లో ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్ పొందేవారు OTT బెనిఫిట్స్ ద్వారా 5Gని పొందవచ్చు.

Jio 5G supported phones :
Jio 5G నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యేందుకు అన్ని 5G సపోర్టు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు సిద్ధంగా లేవు. ప్రతి ఒక్కరూ 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యేలా వీలైనంత త్వరగా 5Gకి సపోర్ట్‌ను లాంచ్ చేయాలని మొబైల్ తయారీదారులను Jio కోరింది. OnePlus కొత్త ఫ్లాగ్‌షిప్‌లు, నథింగ్ ఫోన్ 1 ఇటీవలే Jio 5G కోసం అప్‌డేట్ పొందాయి. డిసెంబర్ 2023 నాటికి Apple iPhoneతో సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు కూడా OEM–ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు నుంచి త్వరలో అప్‌డేట్ ఆశించవచ్చు. Jio నాథ్‌ద్వారాలో 5G WI-FI సర్వీసులను ప్రారంభించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Ex-Apple employee : రూ. 140 కోట్లు కొట్టేసిన ఆపిల్‌ మాజీ ఉద్యోగి.. దోషిగా తేలితే 20ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం!