Broadband Offers : రూ.500లోపు జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఇవే..!

Broadband Offers : ఇంటర్నెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై టెలికం కంపెనీలు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఏయే కంపెనీలు ఎలాంటి ప్లాన్లను అందిస్తున్నాయో చూద్దాం.

Broadband Offers : రూ.500లోపు జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఇవే..!

Jio, Act Fibernet, Airtel, Bsnl And Other Broadband Plans Under Rs 500

Broadband Offers : ఇంటర్నెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై టెలికం కంపెనీలు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ల్యాండ్ లైన్ కనెక్షన్, అన్ లిమిటెడ్ డేటాతో పాటు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాయి. తక్కువ ధరకే అధిక మొత్తంలో అందించే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో సెక్యూర్డ్ వైఫ్ కనెక్షన్ కోసం ప్రయత్నించేవారికి ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మరింత ప్రయోజనకరంగా ఉండనున్నాయి. మీరు కూడా ఒకవేళ రూ.500లోపు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల కోసం ప్రయత్నిస్తున్నారా? జియో ఫైబర్, బీఎస్ఎన్ఎల్, యాక్ట్ ఫైబర్ నెట్, ఎయిర్ టెల్ తమ కస్టమర్ల కోసం ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను రూ.500లోపు అందిస్తున్నాయి. ఏయే కంపెనీలు ఎలాంటి ప్లాన్లను అందిస్తున్నాయో ఓసారి చూద్దాం..

JioFiber : జియో ఫైబర్ కేవలం రూ. 399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ అందిస్తోంది. అన్ లిమిటెడ్ డేటా కాలింగ్‌తో 30Mbps స్పీడ్ అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లకు ఎలాంటి OTT యాప్ సబ్‌స్క్రిప్షన్‌ పొందలేరు. ఒకవేళ ఓటీటీ యాక్సస్ కూడా కావాలంటే అధిక ధర ప్లాన్‌లను ఎంచుకోవాలి.

BSNL : ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం BSNL కూడా తక్కువ ధరకే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. రూ. 329 ప్లాన్‌ కొనుగోలుపై ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తోంది. ప్రస్తుతం ఎంపిక చేసిన సర్కిల్‌లలో మాత్రమే ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందుబాటులో ఉంది. 1TB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. టెలికాం ఆపరేటర్ ఈ ప్లాన్‌తో కేవలం 20 Mbps వేగాన్ని మాత్రమే అందిస్తోంది.

Jio, Act Fibernet, Airtel, Bsnl And Other Broadband Plans Under Rs 500 (1)

Jio, Act Fibernet, Airtel, Bsnl And Other Broadband Plans Under Rs 500

ఈ ప్లాన్‌లో ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ ప్రతిరోజూ 100 SMSలు ఉన్నాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వాలిడిటీ 30 రోజుల వరకు ఉంటుంది. రూ. 449 BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. 30Mbps స్పీడ్‌తో 3,300GB FUP లిమిట్‌తో వస్తుంది. ఆ లిమిట్ ముగిసిన తర్వాత మీ బ్రౌజింగ్ స్పీడ్ 2Mbpsకి పడిపోతుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ లోకల్ STD కాల్‌లను చేసుకోవచ్చు. ఈ ప్లాన్ మొదటి నెల టారిఫ్‌పై కంపెనీ 90 శాతం తగ్గింపును అందిస్తోంది.

ACT Fibernet :
ACT ఫైబర్ నెట్ రూ. 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ఆఫర్ అందిస్తోంది. అన్ని సర్కిల్‌లలో అందుబాటులో లేదు. మీకు హైదరాబాద్‌ సర్కిల్ మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్ నెలకు 1TB డేటాను అందిస్తుంది. దాని తర్వాత 512Kbps FUP స్పీడ్ తగ్గిపోతుంది. ZEE5 సబ్‌స్క్రిప్షన్ cult.fit నెల వరకు ఫ్రీగా ట్రయల్‌ అందిస్తుంది.

Airtel :
Airtel xStream Fiber అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది. ధర రూ. 499 నుంచి అందుబాటులో ఉంటుంది. 40Mbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా (3.3TB వరకు) అన్ లిమిటెడ్ లోకల్ ISD కాలింగ్‌ అందిస్తోంది.ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్ కింద కూడా ఈ ప్లాన్‌ అందిస్తోంది. యూజర్లు Wynk మ్యూజిక్‌కి ఫ్రీగా సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్నాక 30 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు.

Read Also : Airtel Xstream Premium : ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త.. రూ.149కే 15 OTT వీడియో స్ట్రీమింగ్‌ ప్రీమియం సర్వీసులు