Jio Airtel Plans : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లపై 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ మీకోసం..!

Jio Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ మొబైల్ డేటా, వాయిస్ కాలింగ్, అదనపు బెనిఫిట్స్‌తో కూడిన ప్లాన్‌ల కోసం చూస్తున్నారా?

Jio Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ మొబైల్ డేటా, వాయిస్ కాలింగ్, అదనపు బెనిఫిట్స్‌తో కూడిన ప్లాన్‌ల కోసం చూస్తున్నారా? రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ అందించే మల్టీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అదనంగా, ప్లాన్‌లు OTT యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తాయి. Jio, Airtel అందించే 2GB రోజువారీ డేటా లిమిట్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

Jio రోజువారీ 2GB డేటా లిమిట్ ప్లాన్లులివే :
Jio రూ. 249 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 2GB రోజువారీ డేటా లిమిట్‌తో 46GB మొత్తం డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 23 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో Jio TV, Jio సినిమా, Jio సెక్యూరిటీ, Jio క్లౌడ్‌తో సహా Jio యాప్‌లకు ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు.

Jio రూ 299 ప్లాన్ : ఈ ప్యాక్ 2GB రోజువారీ డేటా లిమిట్‌తో 56GB మొత్తం డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో.. రోజుకు 100 SMS, Jio TV, Jio సినిమా, Jio సెక్యూరిటీ, JioCloud ప్యాక్‌తో సహా Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జియో రూ. 533 ప్లాన్ : 56 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్యాక్‌లో 2GB రోజువారీ డేటా లిమిట్‌తో 112GB మొత్తం డేటా ఉంటుంది. 100 రోజువారీ SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, Jio TV, Jio సినిమా, Jio సెక్యూరిటీ Jio క్లౌడ్‌తో సహా అన్నిJio యాప్‌లకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు.

Jio రూ 719 ప్లాన్ : జియో యూజర్లు 2GB రోజువారీ లిమిట్‌తో 168GB మొత్తం డేటాను అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. ఈ ప్యాక్‌లో 84 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో అన్ని జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ఉంటుంది.

జియో రూ. 2879 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ 365 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో 2GB రోజువారీ లిమిట్‌తో 730GB మొత్తం డేటాతో వస్తుంది. అదనంగా, అన్‌లిమిటెట్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.

Jio and Airtel plans offering 2GB daily data, unlimited voice calling benefits

ఎయిర్‌టెల్ 2GB రోజువారీ డేటా లిమిట్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్ : ఈ ప్లాన్ 1-నెల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, Apollo 24|7 సర్కిల్‌కు సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్, ఉచిత HelloTunes, ఉచిత సబ్‌స్క్రిప్షన్. Wink మ్యూజిక్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 359 ప్లాన్ : ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, అపోలో 24|7 సర్కిల్, Xstream మొబైల్ ప్యాక్ సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 100 SMSలు, అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్ : ఈ ప్లాన్ అపోలో 24|7 సర్కిల్‌కు సబ్‌స్క్రిప్షన్, అదనపు బెనిఫిట్స్ సహా 28 రోజుల వ్యాలిడిటీతో 2.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ : ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అదనపు బెనిఫిట్స్ సహా Disney+ Hotstar మొబైల్‌కి 1-ఏడాది సభ్యత్వాన్ని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 549 ప్లాన్ : 56 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 839 ప్లాన్ : ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100 SMSలు, అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ : 2.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కాంప్లిమెంటరీ 84 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 2,999 ప్లాన్ : ఈ వార్షిక ప్లాన్ రోజుకు 2GB డేటాను అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, Amazon Prime మొబైల్ అదనంగా మరిన్నింటిని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 3,359 ప్లాన్ : 2.5GB రోజువారీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ మొబైల్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, మరిన్నింటికి 1-ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Messages : వాట్సాప్‌లో ఎవరిని బ్లాక్ చేయకుండానే అన్‌వాటెండ్ మెసేజ్‌లను పర్మినెంట్‌గా హైడ్ చేయవచ్చు… ఇదిగో ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు