Jio Fiber: టీవీల్లో కూడా వీడియో కాలింగ్‌ చేసే​ సదుపాయం!

ఎప్పటికప్పుడు తమ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో ఫైబర్ ఇప్పుడు మరో కొత్త సదుపాయంతో ముందుకు వచ్చింది. అదే ఇకపై జియో వినియోగదారులు టీవీల్లో కూడా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.

Jio Fiber: టీవీల్లో కూడా వీడియో కాలింగ్‌ చేసే​ సదుపాయం!

Jio Fiber

Jio Fiber: ఎప్పటికప్పుడు తమ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో ఫైబర్ ఇప్పుడు మరో కొత్త సదుపాయంతో ముందుకు వచ్చింది. అదే ఇకపై జియో వినియోగదారులు టీవీల్లో కూడా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి వెబ్ కెమెరాలు కూడా అవసరం లేదు. ‘కెమెరా ఆన్ మొబైల్’ అనే ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ను పొందవచ్చునని జియో తెలిపింది.

అయితే, టీవీల్లో వీడియో కాలింగ్ సదుపాయం పొందాలంటే జియోజాయిన్‌ అనే యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందట. ఇప్పటికే గత కొన్ని నెలలుగా ‘కెమెరా ఆన్ మొబైల్’ ఫీచర్‌ను పరీక్షిస్తోన్న జియో ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్‌ను జియోజాయిన్‌ యాప్‌లో నమోదు చేసి జియో జాయిన్‌ యాప్ సెట్టింగ్‌లలో ‘కెమెరా ఆన్ మొబైల్’ ఫీచర్‌తో వీడియోకాల్స్‌ చేసుకోవచ్చును.

ఇక, స్పష్టమైన వీడియో కాలింగ్‌ సేవల కోసం జియోఫైబర్‌ మోడమ్‌ను 5GHz Wi-Fi బ్యాండ్‌కి మార్చాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను పొందవచ్చునని.. కానీ వీడియో కాలింగ్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చునని జియో తెలిపింది. దీంతోపాటు జియోఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను వినియోగించుకునే తమ మొబైల్‌లోని జియోజాయిన్‌ యాప్‌ ద్వారా ల్యాండ్‌లైన్‌ నంబర్లకు కూడా వాయిస్‌కాల్స్‌ చేసుకోవచ్చునని తెలిపింది.