Redmi: 12 రకాల 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేసే రెడ్ మీ ఫోన్

షియోమీ కంపెనీ జులై 20వ తేదీ కొత్త రెడ్ మీ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే50ఐ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందట. ఇప్పటికే 5జీ నెట్‌‌వర్క్‌కు సంబంధించిన అన్ని బ్యాండ్లను రిలయన్స్ జియో సంస్థతో కలిసి విజయవంతంగా పరీక్షించారు.

Redmi: 12 రకాల 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేసే రెడ్ మీ ఫోన్

Redmi

Redmi: షియోమీ కంపెనీ జులై 20వ తేదీ కొత్త రెడ్ మీ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే50ఐ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందట. ఇప్పటికే 5జీ నెట్‌‌వర్క్‌కు సంబంధించిన అన్ని బ్యాండ్లను రిలయన్స్ జియో సంస్థతో కలిసి విజయవంతంగా పరీక్షించారు.

12 రకాల 5జీ నెట్‌‌వర్క్‌లను సపోర్ట్ చేస్తున్న తొలి రెడ్ మీ ఫోన్ కావడంతో దీనిని సొంతం చేసుకునేందుకు వినియోగదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 4కే స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ వంటి టెస్ట్‌ను ఈ ఫోన్ పాస్ అయినట్లు రెడ్ మీ సంస్థ వెల్లడించింది. ఇలా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా గేమ్‌లు ఆడుకోవడంతోపాటు, రికే క్వాలిటీ వీడియోలను కూడా బఫరింగ్ లేకుండా చూసేయొచ్చు.

రెడ్ మీ 50 ఫీచర్లు

బడ్జెట్ ధర కంటే కాస్త ఎక్కువగా ఈ ఫోన్ రానుంది. చాలా కాలంగా రెడ్‌మీ కంపెనీ ‘K’ సిరీస్‌లో కొత్త ఫోన్ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రెడ్‌మీ కే50ఐ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్లో 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్‌హెచ్‌డీ – రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల ఎల్ సీడీ డిస్ప్లే ఇస్తున్నారు. 5వేల 80 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ పాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

Read Also : ఇండియాలో రెడ్‌మి K సిరీస్ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ ఆల్ట్రా-వైడ్ యాంగిల్, 2 ఎంపీ కెమెరాలున్నాయి. వీడియో కాలింగ్ సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎమయూఐ 13 ఓఎస్లో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 8 కిమీ/256 జీబీ వేరియంట్లో తీసుకురానుంది. రెడ్మీ కే50ఐ ధర 21 వేల నుంచి 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.