FIFA World Cup 2022 : జియోసినిమాలో ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లు లైవ్‌లో చూడొచ్చు.. ఏయే ప్లాట్‌ఫారంలో లైవ్‌స్ట్రీమ్ ఉంటుందంటే?

FIFA World Cup 2022 : FIFA ప్రపంచ కప్ ఫీవర్ కొనసాగుతోంది. ఫుట్‌బాల్ ప్రేమికులందరూ ఆతిథ్య దేశమైన ఖతార్‌లో జరిగే మ్యాచ్‌లపై దృష్టిసారించనుంది. భారతీయ అభిమానుల కోసం.. మ్యాచ్‌లను టెలివిజన్‌తో పాటు జియోసినిమాలో లైవ్ స్ట్రీమ్ అవుతోంది.

FIFA World Cup 2022 : జియోసినిమాలో ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లు లైవ్‌లో చూడొచ్చు.. ఏయే ప్లాట్‌ఫారంలో లైవ్‌స్ట్రీమ్ ఉంటుందంటే?

JioCinema lagging You can Watch FIFA World Cup 2022 livestream on these platforms

FIFA World Cup 2022 : FIFA ప్రపంచ కప్ ఫీవర్ కొనసాగుతోంది. ఫుట్‌బాల్ ప్రేమికులందరూ ఆతిథ్య దేశమైన ఖతార్‌లో జరిగే మ్యాచ్‌లపై దృష్టిసారించనుంది. భారతీయ అభిమానుల కోసం.. మ్యాచ్‌లను టెలివిజన్‌తో పాటు జియోసినిమాలో లైవ్ స్ట్రీమ్ అవుతోంది. JioCinemaలో FIFA వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుకను లైవ్ చేస్తున్నప్పుడు చాలా మంది యూజర్లు సమస్యలను ఎదుర్కొన్నారు. అందుకు జియో కూడా క్షమాపణలు తెలియజేసింది. యాప్‌ను అప్‌డేట్ చేయమని దాని వ్యూయర్లను కోరింది. మీరు Jio సినిమా యాప్ లేదా బ్రౌజర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు లేదా PCలో FIFA ప్రపంచ కప్‌ను లైవ్‌లో చూడవచ్చు.

యాప్ Tizen OS 2.4, అంతకంటే ఎక్కువ ఉన్న Samsung TVలకు, వెర్షన్ 7, అంతకంటే ఎక్కువ ఉన్న Android TVలకు కూడా సపోరటు అందిస్తుంది. OS 10, అంతకంటే ఎక్కువ ఉన్న Apple TV కూడా JioCinema యాప్‌కు సపోర్ట్ చేస్తోంది. ఇప్పుడు మీరు ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను లైవ్‌లను చూసేందుకు మరిన్ని ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నట్లయితే మరిన్ని ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీ iPhone, Android స్మార్ట్‌ఫోన్, iPad, డెస్క్‌టాప్‌లలో మీరు FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను లైవ్‌లో చూసేందుకు అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం.

JioTV :
Jio కనెక్షన్‌తో JioTVలో లైవ్ మ్యాచ్‌లను చూసే యూజర్లు.. JioTVలో మ్యాచ్‌లను చూడవచ్చు. మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, మీ రిజిస్టర్డ్ Jio ఫోన్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయాలి. యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీరు JioTV లైవ్ ఛానెల్‌ల సెక్షన్‌కు వెళ్లి Sports18 లేదా Sports18 HDని ఓపెన్ చేయాలి.

JioCinema lagging You can Watch FIFA World Cup 2022 livestream on these platforms

JioCinema lagging You can Watch FIFA World Cup 2022 livestream on these platforms

My Vi యాప్, Vi సినిమాలు, టీవీ :
Vodafone Idea (Vi) యూజర్లు FIFA వరల్డ్ కప్ 2022ని My Vi యాప్‌లో లైవ్ టెలిక్యాస్ట్ చేయవచ్చు లేదా Vi Movies, TV యాప్‌లో ఉచితంగా మ్యాచ్‌లను ప్రసారం చేయవచ్చు. మీరు OTP ద్వారా మీ రిజిస్టర్డ్ Vi ఫోన్ నంబర్‌ని ఉపయోగించి My Vi లేదా Vi సినిమాలు లేదా Vi TV యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.

Tata Play :
టాటా ప్లే (Tata Sky) యూజర్లు టీవీలో అలాగే టాటా ప్లే యాప్‌లో లైవ్ మ్యాచ్‌లను చూడవచ్చు. యూజర్లు Sports18/Sports18 HDకి యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉండాలి. నెలకు రూ. 14కి లభిస్తుంది. లైవ్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు Android లేదా iOSలో Tata Playని డౌన్‌లోడ్ చేయండి లేదా మీ PCలో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

Television Channel :
Sports18, Sports18 HD FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 మ్యాచ్‌లను భారత మార్కెట్లో ఇంగ్లీష్ ప్రేక్షకుల కోసం ప్రసారం చేస్తోంది. మీరు హిందీలో చూడాలనుకుంటే.. MTV HDలో లైవ్‌లో చూడవచ్చు. ఈ ఛానెల్‌లకు సభ్యత్వాన్ని కొనుగోలు చేయండి లేదా కనెక్షన్‌ని పొందమని మీ DTH ప్రొవైడర్‌ని అడగండి. మీ iPhone, Android స్మార్ట్‌ఫోన్, iPad, డెస్క్‌టాప్‌లలో FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను లైవ్‌లో చూడండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15లో కొత్త డిజైన్‌ మార్పులు.. లేటెస్ట్ లీక్ ఇదే..!