FIFA World Cup 2022 Plans : రిలయన్స్ జియో ఫిఫా వరల్డ్ కప్ ప్లాన్లు ఇవే.. మరెన్నో బెనిఫిట్స్ మీకోసం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

FIFA World Cup 2022 Plans : భారతీయ టెలికాం ఆపరేటర్ జియో ఐదు కొత్త, ప్రత్యేకమైన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలో కనెక్టివిటీని అందించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.

FIFA World Cup 2022 Plans : రిలయన్స్ జియో ఫిఫా వరల్డ్ కప్ ప్లాన్లు ఇవే.. మరెన్నో బెనిఫిట్స్ మీకోసం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio's FIFA World Cup 2022 plans Details on calling, validity, roaming and more

FIFA World Cup 2022 Plans : భారతీయ టెలికాం ఆపరేటర్ జియో ఐదు కొత్త, ప్రత్యేకమైన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలో కనెక్టివిటీని అందించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. టెలికాం దిగ్గజం ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఐదు ప్లాన్‌లతో వస్తుంది. జియో కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు రెండు ప్రధాన వర్గాలుగా అందిస్తోంది. అందులో ప్రధానంగా డేటా, వాయిస్ & SMS ప్యాక్‌లు, డేటా మాత్రమే ప్యాక్‌లను అందిస్తోంది. ఆసక్తికరంగా, కస్టమర్‌లు ఇప్పుడు ఖతార్‌లో మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా సరిపోయే ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు ఏ మార్గం నుంచి ప్రయాణిస్తున్నా తమ కనెక్టివిటీని పొందవచ్చు. ముఖ్యంగా ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా మూడు దేశాల్లో ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయని జియో తెలిపింది.

ప్లాన్‌ల గురించి చెప్పాలంటే.. చౌకైన డేటా, వాయిస్ కాలింగ్, SMS ప్యాక్‌లతో రూ. 1,599 ధరతో వస్తాయి. మొత్తం 150 నిమిషాల వాయిస్, 100 SMS, 1GB డేటాను అందిస్తుంది. టెలికాం దిగ్గజం మరింత డేటా, వ్యాలిడిటీతో SMS కోసం ఖరీదైన ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ మరో ప్లాన్ రూ. 6,799కి 500 నిమిషాల వాయిస్, 100 SMS, 5GB డేటాను అందిస్తుంది. ఎక్కువ సరసమైన ధరతో కూడిన డేటా ప్లాన్ రూ. 1,122 ఐదు రోజుల వ్యాలిడిటీ వ్యవధితో 1GB డేటాను అందిస్తుంది. మరో ఆప్షన్ రూ. 5,122 విలువైన ప్లాన్ అందిస్తోంది. 21 రోజుల వ్యాలిడిటీతో పాటు 5GB డేటా లిమిట్ పొందవచ్చు. చివరగా, Jio రూ. 3,999 విలువైన ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. 30 రోజుల వ్యాలిడిటీ పొందాలంటే 3GB డేటా, 250 నిమిషాల వాయిస్ కాల్ టైం, 100 SMSలను అందిస్తుంది.

Jio's FIFA World Cup 2022 plans Details on calling, validity, roaming and more

Jio’s FIFA World Cup 2022 plans Details on calling, validity, roaming and more

ఖతార్ స్టేడియంలలోకి ఎంట్రీ పొందాలంటే స్థానిక అధికారులు ఎహ్తెరాజ్ యాప్‌ను ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ హయ్యా కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవాలని ఫ్యాన్స్‌కు సూచిస్తోంది. రిలయన్స్ జియో కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి, కోల్‌కతాలో ఎక్కువ భాగం 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. జూన్ 2023 నాటికి 5G ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ప్రకటించింది. త్వరలోనే జియో 5G సర్వీసులను అందించడం ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

సిలిగురిలో, కోల్‌కతా తర్వాత హై-స్పీడ్ డేటా సర్వీసులను అందించిన రాష్ట్రంలో రెండో నగరంగా నిలువనుంది. డిసెంబరు 2023 నాటికి దేశవ్యాప్తంగా 5G సర్వీసులను అందించడంలో భాగంగా సిలిగురిలో 5Gని లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోందని రిలయన్స్ జియో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోల్‌కతా, సిలిగురిలో ఎయిర్‌టెల్ 5G సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. జియో కొన్ని నగరాల్లో తన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Android Screen Lock : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు స్ర్కీన్ లాక్ వేశారా? మీకు తెలియకుండానే సిమ్ కార్డుతో ఇలా అన్‌లాక్ చేయొచ్చు!