India : ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్‌‌ను తొలగించిన ట్విట్టర్

సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter)  భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది.

India : ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్‌‌ను తొలగించిన ట్విట్టర్

Jammu

India Map On Twitter : సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter)  భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ ను వేరే దేశంగా కూడా చూపించడంపై దుమారం రేపుతోంది. ట్విట్టర్ పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ పై చర్యలు తీసుకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకొనేందుకు నడుం బిగించింది.

గత కొన్ని రోజులుగా ట్విట్టర్ – కేంద్రం మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించేందుకు తొలుత Twitter ససేమిరా అంటూ మొండికేసిన సంగతి తెలిసిందే. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో..ట్విట్టర్‌.. ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. అందుకు కొంత సమయం కావాలని కోరింది.

ఇది కొనసాగుతుండగానే..ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇతర కీలక నేతలకు చెందిన బ్లూ టిక్ మార్కులను తొలగించడం వివాదాస్పదమైంది. మరలా దీనిని పునరావృతం చేసింది. తర్వాత..కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్ ను బ్లాక్ చేసింది. వీక్షకులను ఆయన ఖాత కనిపించినప్పటికి పోస్ట్ పెట్టడానికి మాత్రం వీలు కాలేదు. విషయం తెలియడంతో ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్‌‌కు హెచ్చరిక సందేశం పంపాయి. దీంతో వారు గంట తర్వాత అకౌంట్ ను పునరుద్ధరించారు. తాజాగా ట్విట్టర్ చర్యలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.