J&K tunnel collapse: జమ్మూలో కూలిన టన్నెల్.. పది మంది మృతదేహాల స్వాధీనం

జమ్మూ-కాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో మొత్తం పది మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. రాంబన్ జిల్లాలోని ఒక నాలా వద్ద సొరంగ నిర్మాణం జరుగతుండగా, గురువారం రాత్రి టన్నెల్ కూలిపోయింది.

J&K tunnel collapse: జమ్మూలో కూలిన టన్నెల్.. పది మంది మృతదేహాల స్వాధీనం

J&k Tunnel Collapse

J&K tunnel collapse: జమ్మూ-కాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో మొత్తం పది మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. రాంబన్ జిల్లాలోని ఒక నాలా వద్ద సొరంగ నిర్మాణం జరుగతుండగా, గురువారం రాత్రి టన్నెల్ కూలిపోయింది. దీంతో శిథిలాల్లో చిక్కుకున్న పది మంది కూలీల కోసం అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శనివారం సాయంత్రానికి పది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు. పదిమంది మృతుల్లో ఐదుగురు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు. ఘటనపై కేసు నమోదు చేశామని, మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని రాంబన్ జిల్లా ఎస్పీ, అధికారులు తెలిపారు.

PM Modi: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్

రాంబన్ జిల్లాలో జమ్మూ-కాశ్మీర్ జాతీయ రహదారిపై నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిలో భాగంగా ఒక కొండ మధ్యలో సొరంగం తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాల స్వాధీనంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు.