Job Recruitment : గెయిల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

భర్తీ చేయనున్న పోస్టుల్లో మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ వంటి ఖాళీలు ఉన్నాయి.

Job Recruitment : గెయిల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

గెయిల్ లో 220 పోస్టుల భర్తీ

Job Recruitment : భారత ప్రభుత్వరంగ సంస్ధ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్ ఆర్ , లా తదితర విభాగాల్లో మొత్తం 220 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల్లో మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ వంటి ఖాళీలు ఉన్నాయి. అయా పోస్టులకు తగిన విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్టెక్టుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పిజీ డిప్లొమా, సిఏ, సిఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతోపాటు పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి.

వచ్చిన ధరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్ధులను గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అన్ లైన్ ద్వారా ధరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేదిగా 05.08.2021. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.gailonline.com