Jobs : నెలకు రూ.56వేలు జీతం.. ఏపీ వాటర్‌ రిసోర్స్ విభాగంలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs : నెలకు రూ.56వేలు జీతం.. ఏపీ వాటర్‌ రిసోర్స్ విభాగంలో ఉద్యోగాలు

Jobs

Ap Water Resources Department Jobs : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం పోస్టుల సంఖ్య: 07
* పోస్టుల వివరాలు: హైడ్రాలజిస్ట్‌-01
* కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్-03
* అకౌంటెంట్‌-01
* డేటా ఎంట్రీ ఆపరేటర్‌-02.

పోస్టులు-అర్హతలు:
* హైడ్రాలజిస్ట్‌:
అర్హత: బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం/ఎంటెక్‌(వాటర్‌ రిసోర్సెస్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీలో
ఏడాది అనుభవం ఉండాలి.
* వేతనం నెలకు రూ.56వేలు.
* పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

* కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌:
అర్హత: కెమిస్ట్రీలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ల్యాబ్‌ అనుభవం ఉండాలి.
* వేతనం నెలకు రూ.24,500.
* పని ప్రదేశం: కడప, గుంటూరు వాటర్‌ క్వాలిటీ ల్యాబ్స్‌.

* అకౌంటెంట్‌:
అర్హత: ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
* వేతనం నెలకు రూ.17,500.
* పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

* డేటాఎంట్రీ ఆపరేటర్‌:
* అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
* వేతనం నెలకు రూ.15వేలు చెల్లిస్తారు.
* పని ప్రదేశం: చీఫ్‌ ఇంజినీర్, హైడ్రాలజీ, విజయవాడ.

► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
► ఈమెయిల్‌: cehydrology@ap.gov.in
► దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021
► వెబ్‌సైట్‌: https://irrigationap.cgg.gov.in/wrd/home