ఆమె చివరి కోరిక : నా నగలన్నీ రామ మందిర నిర్మాణానికి ఇచ్చాకే అంత్యక్రియలు జరపాలని

ఆమె చివరి కోరిక : నా నగలన్నీ రామ మందిర నిర్మాణానికి ఇచ్చాకే అంత్యక్రియలు జరపాలని

Jodhpur woman expressed  rs.7 lakh for ram mandir : చాలామంది చనిపోయేటప్పుడు చివరి కోరికగా తమ ఆస్తి ఫలానావారికి ఇవ్వాలనో..లేదో తనపేరున ఏదైనా నిర్మించాలనో..లేదా బంధుమిత్తుల్ని చూడాలని ఉందో కోరతారు. కానీ రాజస్థాన్ లోని జోథ్ పూర్ కు చెందిన ఓ మహిళ మాత్రం ‘‘నేను చనిపోయాక నా నగలన్నీ జోథ్ పూర్ లో నిర్మించే రామ మందిరానికి ఇవ్వాలని..ఆ నగలన్ని రాముడికి సమర్పించాకే తన అంత్యక్రియలు జరపాలని’’ భర్తను ఆఖరికోరిక కోరింది..దీంతో ఆమె చనిపోయిన తరువాత భార్య కోరిక మేరకు ఆ నగల్ని రామ మందిరానికి చేర్చిన తరువాతే అంత్యక్రియల్ని జరిపించాడా భర్త..!

గత ఫిబ్రవరి 4న జోథ్ పూర్‌లో రామాలయం నిర్మించడానికి విరాళాలు సేకరిస్తున్న హేమంత్‌ అనే పూజారికి ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ చేసినవారు “నేను విజయ్ సింగ్‌ని మాట్లాడుతున్నాను. నా భార్య పేరు ఆశా. ఆమె చనిపోయింది. ఆమె నగలన్నింటినీ రామాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇస్తున్నాను” మీరు వెంటనే వచ్చి ఆ నగల్ని తీసుకోండీ..మీరు నగలు తీసుకున్నాకే..నేను నా భార్యకు అంత్యక్రియలు జరపాలి. అది ఆమె ‘ఆఖరి కోరిక’ అని చెప్పారు. ఆ మాటలు విన్న పూజారి హేమంత్ ఆశ్చర్యపోయారు.


ఆ మాటలు విన్న కాసేపటి వరకూ హేమంత్ కు మాటలు రాలేదు. తరువాత తేరుకుని..”నేను దేవాలయంలో పూజారిని..పండితుణ్ని…ఆమె కోరిక నెరవేరుతుంది…ముందు మీరు మీ భార్య అంత్యక్రియలు పూర్తి చేయండి. ఆ తర్వాత మేము వచ్చి..నగలు తీసుకుంటాము” అని చెప్పారు. దీంతో విజయ్ సింగ్ భార్య అంత్యక్రియల్ని పూర్తి చేశారు.

 

భార్య ఆఖరి కోరిక గురించి భర్త విజయ్ సింగ్ మాట్లాడుతూ..నా భార్య ఫిబ్రవరి 4న చనిపోయింది. చనిపోవటానికి ముందు ఫిబ్రవరి 1న నన్ను..మా అబ్బాయిని పక్కనే కూర్చోపెట్టుకుని నాదో‘ చివరి కోరిక’ ఉంది తీరుస్తారా? అని అడిగింది. ఏంటో చెప్పమన్నాం…దానికి నా భార్య ఆశా…నా నగలన్నింటీనీ రామాలయ నిర్మాణం కోసం ఇచ్చేయాలని..ఆ తరువాతే నా అంత్యక్రియలు జరపండీ అని కోరిందని..ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోయిందనీ చెప్పారు.

దీనిపై రామాలయ పూజారి హేమంత్‌తో మాట్లాడి మొత్తం 15 తులాల బంగారు నగలు, 23 గ్రాముల వెండి నగల్ని అమ్మి..దానికి వచ్చిన మొత్తం రూ.7,08,521 నగదును విరాళంగా ఇచ్చేశారని తెలిపారు. విజయ్ పేరు మీద విరాళం రసీదు కాపీని హేమంత్ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా అందర్నీ కలచివేసింది. ఆమె జీవించి ఉంటే..వారి కుటుంబానికి బాగుండేదని స్థానికులు అనుకుంటున్నారు.