John Abraham: నోరుజారిన హీరో.. దెబ్బ మామూలుగా లేదుగా!

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఇటీవల తన తాజా చిత్రం ‘ఎటాక్’ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ భాగంగా దక్షిణాది సినిమాలపై కొన్ని విమర్శలను గుప్పించాడు. తానొక బాలీవుడ్.....

John Abraham: నోరుజారిన హీరో.. దెబ్బ మామూలుగా లేదుగా!

John Abraham Attack Fails At Box Office Collections Due To Rrr

John Abraham: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఇటీవల తన తాజా చిత్రం ‘ఎటాక్’ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ భాగంగా దక్షిణాది సినిమాలపై కొన్ని విమర్శలను గుప్పించాడు. తానొక బాలీవుడ్ హీరోనని.. దక్షిణాదిన సినిమాను తాను చేయనంటూ జాన్ చెప్పుకొచ్చాడు. అయితే అతడు కేవలం హిందీ భాషలోనే సినిమాలను తెరకెక్కిస్తానని.. బాలీవుడ్ వదిలి మిగతా ఇండస్ట్రీల్లో సినిమాలు చేయనంటూ జాన్ ఇటీవల చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి.

John Abraham: సౌత్ సినిమాలపై ‘ఎటాక్’ చేసిన హీరో.. మండిపడుతున్న ఫ్యాన్స్!

దీంతో జాన్ అబ్రహాం సినిమాలను సౌత్‌లో ఆడనివ్వం అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఇక ఏప్రిల్ 1న ఎటాక్ చిత్రాన్ని మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఆల్రెడీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ తన జోరును చూపిస్తూ దూసుకుపోతుండటంతో, ఎటాక్ సినిమా ఈ చిత్రంపై ఏకోసాన కూడా ఎటాక్ చేసినట్లుగా కనిపించలేదు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగా రావడం, వీకెండ్ కావడంతో నార్త్‌లో మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రేక్షకుల తాకిడి పెరగడంతో ఎటాక్ సినిమాకు కనీస కలెక్షన్లు కూడా రాలేదు.

John Abraham: మీ సినిమాలు అతిగా ఉంటున్నాయ్ సార్.. రిపోర్టర్లపై హీరో సెటైర్లు!

తొలిరోజైన శుక్రవారం నాడు ఎటాక్ సినిమాకు కేవలం రూ.3 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాగా, ఆర్ఆర్ఆర్‌కు అదే రోజున రూ.12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఎటాక్ సినిమాకు ఆదరణ లేకపోవడంతో జాన్ అబ్రహం తాను చేసి కామెంట్స్ తన సినిమా వసూళ్లపై ప్రభావం చూపాయని ఆలస్యంగా గ్రహించాడు. మరి ఇప్పటికైనా దక్షిణాది సినిమాలపై తన కామెంట్స్‌ను ఈ హీరో వెనక్కి తీసుకుంటాడా లేడా అనేది చూడాలి.