Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా

ఈ నెల 16న త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, సీఎం మాణిక్ సాహా గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. ఈ ఎన్నికల తర్వాత తిరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది

Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు వచ్చేవారమే జరగబోతున్నాయి. ఈ నెల 16న త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, సీఎం మాణిక్ సాహా గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది.

Telangana Teachers MLC Election : తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పోలింగ్ మార్చి 13

ఈ ఎన్నికల తర్వాత తిరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఈ ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటికే ప్రచారపర్వం ప్రారంభించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా బీజేపీ ‘సంకల్పాత్ర 2023’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జేపీ నద్దా మాట్లాడుతూ ‘‘ఇది ఒక కాగితం మాత్రమే కాదు.. బీజేపీకి ప్రజలపై ఉన్న నిబద్ధతతకు సాక్ష్యం. త్రిపుర ఒకప్పుడు తిరుగుబాటు, దిగ్బంధాలకు ప్రసిద్ధి. అలాంటి రాష్ట్రం ఇప్పుడు శాంతి, శ్రేయస్సు, అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. ప్రజల విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో పని చేస్తుంది. త్రిపురలో 13 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇచ్చాం.

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. తేల్చి చెప్పిన కేంద్రం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.107 కోట్లు చెల్లించాం’’ అని జేపీ నద్దా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం జేపీ నద్దా ర్యాలీ నిర్వహించారు. త్రిపురతోపాటు ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని మోదీ కూడా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 50సార్లుపైగా పర్యటించడం విశేషం. త్రిపురకు సంబంధించి మరోసారి ఇక్కడ అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే కేంద్ర మంత్రులతో ప్రచారం నిర్వహించింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించారు. దీంతో ఈసారి కూడా అధికారం దక్కుతుందనే నమ్మకంతో బీజేపీ ఉంది.

ట్రెండింగ్ వార్తలు