ప్రేమగా ఎలా పిలిచినా పలుకుతా: NTR

ప్రేమగా ఎలా పిలిచినా పలుకుతా: NTR

Jr Ntr

Jr NTR:వెండితెరపై రికార్డులకు కేరాఫ్.. ఎన్టీఆర్.. బుల్లితెరపై కూడా సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ షోతో బుల్లితెరపై అధ్బుతం అని అనిపించుకున్న తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ మరోసారి బుల్లితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా అమ్మ చిన్నప్పుడు ఒకపేరుతో పిలిచేది పలికాను.. మా ఆవిడ ఒక పేరు పెట్టి పిలుస్తోంది పలుకుతున్నాను.. నా పిల్లలు నాన్న అంటున్నారు.. పలుకుతున్నాను.. తారక్ అన్నా పలుకుతాను.. జూనియర్ అన్నా పలుకుతాను.. రామారావు అన్నా పలుకుతాను.. ప్రేమగా ఎలా పిలిచినా పలుకుతాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

అలాగే తన పేరుతో టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తున్న సేవాకార్యక్రమాల గురించి విలేఖరి ప్రశ్నించగా.. నేను చెప్పలేదు వాళ్లకు.. ఇలా చెయ్యండి అని.. కానీ వాళ్లు మంచి పని చేస్తున్నారు. ఆనందమే కదా? అన్నారు.