Jr NTR Birthday: బుల్లి రామయ్య కొత్త పోస్టర్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా!

తమ హీరోల పుట్టినరోజుల నాడు అభిమానులు సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ లాంటి భారీ అభిమాన గణమున్న హీరో పుట్టినరోజు అంటే ఇక ఆ సందడే వేరని చెప్పాలి.

Jr NTR Birthday: బుల్లి రామయ్య కొత్త పోస్టర్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా!

Jr Ntr Birthday

Jr NTR Birthday: తమ హీరోల పుట్టినరోజుల నాడు అభిమానులు సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ లాంటి భారీ అభిమాన గణమున్న హీరో పుట్టినరోజు అంటే ఇక ఆ సందడే వేరని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్స్ దగ్గర నుండి తమ హీరోకు శుభాకాంక్షలు చెప్పేవరకు అభిమానులు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు.

కాగా, మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అభిమానులు బుల్లి రామయ్యగా పిలుచుకునే ఎన్టీఆర్ ఇప్పుడు కరోనాతో ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యపరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పిన తారక్ తన ఆరోగ్యం పెరుగుపడిందని చెప్పడంతో అభిమానులు ఈ పుట్టినరోజును మరింత ఉత్సాహంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇక, ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా నుండి కొత్త పోస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన సినీ మేకర్స్ ఎట్టకేలకు కొత్త పోస్టర్ ఆ టైంను వెల్లడించారు. ఈ మోస్ట్ అవైటెడ్ భీం ఇంటెన్స్ పోస్టర్ ను మే 20 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీంతో తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెర పడింది. అయితే.. ఇప్పుడు ఈ పోస్టర్ ఎలా ఉంటుందా అని ఆసక్తి మొదలైంది. రాజమౌళి అప్పుడు చరణ్ నుంచి సీతారామరాజుగా ఊహించని మేకోవర్ లుక్ ను చూపించారు. మరి ఈసారి భీంగా రామయ్యను ఎలాంటి అవతార్ లో చూపిస్తారో చూడాల్సి ఉంది.