జూ.ఎన్టీఆర్ పెట్టుకున్న మాస్క్ రేటు ఎంతంటే!..

జూ.ఎన్టీఆర్ పెట్టుకున్న మాస్క్ రేటు ఎంతంటే!..

Jr.NTR: సెలబ్రిటీలు ఏం చేసినా, ఎలా కనబడినా క్రేజే.. వారి లగ్జీరియస్ లైఫ్ స్టైల్, వాడే కార్స్, డ్రెస్సెస్ నుండి ప్రతి విషయం తెలుసుకోవాలని ఫ్యాన్స్, ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ షూ, రామ్ చరణ్ గాగుల్స్ ప్రైస్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇప్పుడు తారక్‌ పెట్టుకున్న మాస్క్ గురించిన వార్త వైరల్ అవుతోంది.. బ్రిలియంట్ డైరెక్టర్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కి మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగ చైతన్య కపుల్స్‌తో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. మహేష్, తారక్ తదితరులు మాస్క్‌లు ధరించారు.

NTR

వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఫార్మల్ షూతో యంగ్ టైగర్ సింపుల్ లుక్ లో స్టైలిష్ గా కనిపించారు. ఇక తారక్ పెట్టుకున్న బ్లాక్ మాస్క్ విషయానికొస్తే.. ఇది యూఏ స్పోర్ట్స్ మాస్క్.. దీని ధర అక్షరాలా రూ.2, 340 లు.. ఇటీవల ఎయిర్‌‌పోర్టులో తారక్ HERMES బ్రాండ్ షూస్‌తో కనిపించగా.. అది గమనించిన ఫ్యాన్స్ గూగుల్‌లో సెర్చ్ చేశారు. షూ కాస్ట్ అక్షరాలా రూ. 75 వేలు అని చూపించడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేశారు.

NTR

యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 13న ఈ మూవీ రిలీజ్ కానుంది. తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ గ్యాప్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ రియాలిటీ షో తో బుల్లితెరపై సందడి చెయ్యనున్నారు. త్రివిక్రమ్ తర్వాత ‘కె.జి.యఫ్’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నారు.

https://10tv.in/ntr-shoe-price-goes-viral/