Jr NTR: తమిళ క్రేజీ హీరోతో తారక్ మరో మల్టీస్టారర్?

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమా నుండి తారక్ ఆచితూచి అడుగులేస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుండి ఒడిదుడుకులు ఎదుర్కొన ఎన్టీఆర్ కథల ఎంపికలో మరింత శ్రద్ద పెట్టి వరస విజయాలు దక్కించుకుంటున్నాడు.

Jr NTR: తమిళ క్రేజీ హీరోతో తారక్ మరో మల్టీస్టారర్?

Jr Ntr1

Jr NTR: టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమా నుండి తారక్ ఆచితూచి అడుగులేస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుండి ఒడిదుడుకులు ఎదుర్కొన ఎన్టీఆర్ కథల ఎంపికలో మరింత శ్రద్ద పెట్టి వరస విజయాలు దక్కించుకుంటున్నాడు. ఈక్రమంలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాలు తెచ్చేందుకు విరామం వచ్చినా ప్రతి సినిమాను ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకే కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్న తారక్ ప్రస్తుతం తర్వాత రాబోయే సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు ప్రకటన వచ్చేసింది.

కొరటాల శివ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉండదనుందని బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథ చర్చలు కూడా పూర్తవగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్టులే కాగా ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ మరో భారీ మల్టీస్టారర్ చేయనున్నాడని ఇప్పుడు మరో కథనం ఆసక్తిగా మారింది. తారక్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే.. ఆ తర్వాత ఆ సినిమా గురించి పెద్దగా వినిపించలేదు. కాగా.. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతోనే ఇన్నాళ్లు స్పష్టత రాలేదని.. ఇప్పుడు మరోసారి చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. తమిళంలో భారీ క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ ఒకరు. అక్కడ ఆయన సినిమాలు విడుదలవుతుంటే జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటు తెలుగులో ఎన్టీఆర్, అటు తమిళంలో విజయ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కాగా ఈ ఇద్దరితోనే అట్లీ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ వార్తే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ చేరేసి రెండు సినిమాలకు ఒకే చెప్పి బిజీగా ఉన్నారు. మరి అప్పటికి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Read: Jr NTR: తారక్ పుట్టినరోజున అభిమానులకు స్పెషల్ ట్రీట్?!