Jr Ntr : యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఎన్టీఆర్ – అట్లీ మూవీ..

తమిళ్‌లో తన సత్తా చూపిస్తున్న అట్లీ.. ఎన్టీఆర్ ఇమేజ్‌కి, స్టామినాకి తగ్గట్టు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని ప్లాన్ చేస్తున్నారు..

Jr Ntr : యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఎన్టీఆర్ – అట్లీ మూవీ..

Jr Ntr

Jr Ntr: ప్రజెంట్ స్టార్ హీరోలందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. వీళ్లందరిలో కాస్త స్లోగా ఉంది యంగ్ టైగర్. కానీ, ఇప్పుడు ఈ టైగర్ కూడా స్పీడ్ పెంచేసింది. నిన్న కాక మొన్న ప్రశాంత్ నీల్‌తో సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ లేటెస్ట్‌గా తమిళ్ డైరెక్టర్‌తో మరో సినిమా లైనప్ చేసాడు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏంటో డీటెయిల్డ్‌గా చూద్దాం.

ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ చెయ్యబోయే ప్రాజెక్ట్ మీద మొన్నటి వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. కానీ ఎన్టీఆర్.. త్రివిక్రమ్‌తో కాదు.. కొరటాలతో సినిమా చేస్తున్నానని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండానే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేసి ఫుల్ సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడు మరో సినిమా లైన్లో పెట్టేశారు ఎన్టీఆర్.

కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలు ఇంకా స్టార్ట్ కూడా అవ్వకుండానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు యంగ్ టైగర్. ఎప్పటినుంచో ఎన్టీఆర్‌తో సినిమా కోసం ట్రై చేస్తున్న యంగ్ తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌‌లో వైజయంతి మూవీస్ ప్రొడక్షన్‌లో.. ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ చేసినట్టు టాక్. యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో తన స్టైల్‌ని చూపించిన అట్లీ, ఎన్టీఆర్‌కి ఇప్పటికే రెండు, మూడు స్టోరీ లైన్స్ కూడా చెప్పారని సమాచారం.

తమిళ్‌లో తన సత్తా చూపిస్తున్న అట్లీ.. ఎన్టీఆర్ ఇమేజ్‌కి, స్టామినాకి తగ్గట్టు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివతో చెయ్యబోతున్న సినిమా కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు, అట్లీ సినిమాని కూడా ప్యార్లర్‌‌గా చేసేయ్యాలని ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. సో, యాజ్ పర్ ప్లాన్.. ఎన్టీఆర్ – అట్లీ మూవీ నెక్ట్స్ ఇయర్ పట్టాలెక్కడం గ్యారంటీగా కనిపిస్తోంది.