Justice Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్.. రేపే బాధ్యతల స్వీకరణ

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన 50వ సీజేఐ కాబోతుండటం విశేషం. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ యూయూ లలిత్ రిటైరైన సంగతి తెలిసిందే.

Justice Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్.. రేపే బాధ్యతల స్వీకరణ

Justice Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. బుధవారం ఆయన 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ యూయూ లలిత్ రిటైరైన సంగతి తెలిసిందే. చంద్రచూడ్ 2016, మే 13న తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.

Sania Mirza: సానియా మీర్జా విడాకులకు సిద్ధమైందా.. షోయబ్ ఆమెను మోసం చేశాడా?

ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. నవంబర్ 10, 2024న పదవీ విరమణ పొందుతారు. భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆయనకు తగినంత సమయం దొరుకుతుంది. గతంలో ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన 16వ సీజేఐగా, ఫిబ్రవరి 2,1978 నుంచి జూలై 11,1985 వ‌ర‌కు సీజేఐగా కొనసాగారు. ఇప్పటికే డి.వై.చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా మారిన నేపథ్యంలో ఇంకెలాంటి కీలక తీర్పులు ఇస్తారో చూడాలి.