Justice Apology: అడ్వకేట్ కంప్లైంట్‌కు క్షమాపణ కోరిన హైకోర్టు జస్టిస్

అడ్వకేట్ జయశ్రీ పాటిల్ మే5న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, బాంబే హైకోర్టు జస్టిస్ ఎస్ఎస్ షిండేపై కంప్లైంట్ రిజిష్టర్ చేయించారు. అందులో తనకు అవమానం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం జరిగిన విచారణలో తాను మాట్లాడిన హార్ష్ వర్డ్స్ ..

Justice Apology: అడ్వకేట్ కంప్లైంట్‌కు క్షమాపణ కోరిన హైకోర్టు జస్టిస్
ad

Justice Apology: అడ్వకేట్ జయశ్రీ పాటిల్ మే5న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, బాంబే హైకోర్టు జస్టిస్ ఎస్ఎస్ షిండేపై కంప్లైంట్ రిజిష్టర్ చేయించారు. అందులో తనకు అవమానం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం జరిగిన విచారణలో తాను మాట్లాడిన హార్ష్ వర్డ్స్ (కించపరిచే మాటలు)కు మన్నింపు కోరుతున్నానని జస్టిస్ అన్నారు. ఆ తర్వాత తాను చేసిన కంప్లైంట్ ను వెనక్కు తీసుకుంటానని జయశ్రీ పాటిల్ మాటిచ్చారు.

ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఇండియా టుడే కథనం ప్రకారం.. మార్చి నెలలో జయశ్రీ పాటిల్ కోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పారు. ఆ పిటీషన్ లో తాను మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లానని కాకపోతే అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేయడం లేదని తేల్చేశారు.

జస్టిస్ షిండె నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ వింటూ.. కాపీ-పేస్ట్ చేసి పిటిషన్ పట్టుకొచ్చేశారా.. అనడమే కాకుండా.. చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేశారా అని ప్రశ్నించారు. పాటిల్ పిటిషన్ ఆ తర్వాత ఏప్రిల్ లో చీఫ్ జస్టిస్ దీపంకర్ దత్తా బెంచ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మాజీ హోం మంత్రిపై కంప్లైంట్ చేసేందుకు ముందుకొచ్చిన ఆమెను ప్రశంసించారు.

మంగళవారం అనిల్ దేశ్ ముఖ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారణ జరిపింది. పాటిల్ మాట్లాడుతూ తాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకోలేదని చెప్పారు. దాంతో పాటు తన పిటిషన్ ను ఒక్క జస్టిస్ షిండ్ బెంచ్ మినహాయించి ఏ బెంచ్ తో అయినా విచారణ జరిపించాలని కోరారు.

ఇతర సీనియర్ లాయర్ల సమక్షంలో జరిగిన విచారణ తర్వాత తాను చేసిన కామెంట్లకు జస్టిస్ షిండే విచారం వ్యక్తం చేశారు. ‘కోర్టు అంటే లాయర్లు, జడ్జిలతో ఓ కుటుంబంలా భావిస్తాం. ఒక్కోసారి మాటలు బాధించవచ్చు. దానికి విచారం వ్యక్తం చేస్తున్నా’ అని షిండే అన్నారు. ఆ మాటలకు పాటిల్ కూడా తన కంప్లైంట్ వెనక్కు తీసుకుంటానని మాటిచ్చారు.

ఏదేమైనా అనిల్ దేశ్ ముఖ్ కేసు తదుపరి విచారణ జూన్ 10న జరగనుంది. మాజీ హోం మంత్రి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ వినిపిస్తుంది.