Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన ఆయన.. 2010 సెప్టెంబర్‌ 6న సీనియర్‌ న్యాయవాదిగా ప్రమోషన్‌ పొందారు.

Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

Ujjal Bhuyan (1)

Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్ ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్‌ తమిళి సై ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. దాదాపు 8 నెలల తర్వాత సీఎం కేసీఆర్ కు రాజ్ భవన్ కు వెళ్లారు.

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన ఆయన.. 2010 సెప్టెంబర్‌ 6న సీనియర్‌ న్యాయవాదిగా ప్రమోషన్‌ పొందారు. 2011 జూలై 21న అసోం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా, 2011 అక్టోబర్‌ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు.

CM KCR : 8 నెలల తరువాత రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్

2019 అక్టోబర్‌ 3న బదిలీపై బాంబే హైకోర్టుకు వెళ్లిన భూయాన్.. గత ఏడాది అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా తన సమర్థతను చాటారు. ఇప్పటి వరకు సీజేగా ఉన్న సతీశచంద్రశర్మ ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ కావడంతో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.