‘జ్వాలా రెడ్డి’ సాంగ్ ఊపు ఊపుతోంది..

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘సీటీమార్’.. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న సినిమా ఇది.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యాచో హీరో సరసన మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది.

‘జ్వాలా రెడ్డి’ సాంగ్ ఊపు ఊపుతోంది..

Jwala Reddy​ Song

Jwala Reddy​ song: మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘సీటీమార్’.. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న సినిమా ఇది.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యాచో హీరో సరసన మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది.

Seetimaarr

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ‘సీటీమార్’ టైటిల్ సాంగ్ ఆకట్టుకున్నాయి. శుక్రవారం ‘జ్వాలా రెడ్డి’ అనే మరో పాట విడుదల చేశారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ట్యూన్ కంపోజ్ చెయ్యగా కాసర్ల శ్యాం లిరిక్స్ రాశారు. మంగ్లీ, శంకర్ బాబు పాడారు. తెలంగాణ నేపథ్యాన్ని గుర్తుకు తెచ్చే లిరిక్స్, మాస్ బీట్ సాంగ్‌కి ప్లస్ అయ్యాయి.
ఈ చిత్రంలో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్, తమన్నా తెలంగాణ జట్లకు కోచ్‌లుగా కనిపించనున్నారు.

Seetimaarr

దిగంగ‌న సూర్య‌వంశీ, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ‘సీటీమార్’ ఏప్రిల్ 2 న రిలీజవుతోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.