Salaar : ప్రభాస్ అక్కగా జ్యోతిక..!

సెకండ్ ఇన్నింగ్స్‌లో కథాబలమున్న లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న జ్యోతిక, తనకు ఆఫర్ చేసిన రోల్ నచ్చడంతో ‘సలార్’ ప్రభాస్ సోదరిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్..

Salaar : ప్రభాస్ అక్కగా జ్యోతిక..!

Jyothika To Play Prabhas Sister Role In Salaar Movie

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో, హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. డార్లింగ్ పక్కన శృతి హాసన్ తొలిసారి కథానాయికగా నటిస్తుండగా.. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మధు గురుస్వామి విలన్‌గా కనిపించనున్నారు..

Salaar

సీనియర్ నటి, ‘శివగామి’ రమ్యకృష్ణ, ప్రభాస్ సిస్టర్ రోల్ చెయ్యనున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.. ప్రభాస్ నటించిన ‘అడవిరాముడు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించిన రమ్యకృష్ణ తర్వాత ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ తల్లి పాత్రలో అదరగొట్టేశారు.. ఆమె ప్రభాస్ అక్కగా కనిపింబోతున్నట్లు టాక్స్ నడిచాయి కానీ మూవీ టీం ఏ విషయం చెప్పలేదు..

Salaar : ‘సలార్’ లో చిరు..! క్లారిటీ ఇచ్చిన మెగా కాంపౌండ్..

కట్ చేస్తే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం మరో సీనియర్ నటి జ్యోతికను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కథాబలమున్న లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న జ్యోతిక, తనకు ఆఫర్ చేసిన రోల్ నచ్చడంతో ‘సలార్’ ప్రభాస్ సోదరిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.. ఇంతకీ ఎవరు ప్రభాస్ సిస్టర్‌గా కనిపించనున్నారో క్లారిటీగా తెలియాలంటే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చెయ్యాల్సిందే మరి..