రాకీ భాయ్ రఫ్ఫాడిస్తున్నాడుగా!

రాకీ భాయ్ రఫ్ఫాడిస్తున్నాడుగా!

K.G.F 2 Teaser: యావత్ సినీ ప్రపంచం చూపు కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తిప్పిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్’ కి సీక్వెల్‌గా ‘కె.జి.యఫ్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కె.జి.యఫ్. చాప్టర్ 2’ ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

జనవరి 8న రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్న టీజర్ ముందుగానే లీక్ అవడంతో జనవరి 7 రాత్రే విడుదల చేసింది మూవీ టీమ్. సెలబ్రిటీలు, సినీ ప్రియులు మరియు అభిమానులనుంచి టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అధీరాగా సంజయ్ దత్, రమీకా సేన్‌గా రవీనా టాండన్ కనిపించారు.

K.G.F 2 Teaser

యష్ లుక్స్, మేనరిజమ్స్, విజువల్స్, ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. ముఖ్యంగా రాకీ భాయ్ సిగరెట్ వెలిగించే షాట్ అయితే మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ అని చెప్పాలి. ఇప్పటికే 40 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ‘కె.జి.యఫ్ 2’ టీజర్..

వెండితెరపై ఇంతకుముందెన్నడూ చూడని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక.. ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు, అచ్యుత్ కుమార్, మాళవికా అవినాష్, అయ్యప్ప పి.శర్చ, అర్చనా జోషి కీలకపాత్రల్లో కనిపించనున్నారు.