K. A. Paul: ముషారఫ్ నా ముందు మోకరిల్లాడు.. కేసీఆర్, కేటీఆర్ ఎంత..

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

K. A. Paul: ముషారఫ్ నా ముందు మోకరిల్లాడు.. కేసీఆర్, కేటీఆర్ ఎంత..

Ka Paul

K. A. Paul: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బుధవారం అమీర్‌పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో పాల్ మీడియాతో మాట్లాడారు.. కేసీఆర్ తనపై సిరిసిల్ల ఎస్పీ సహాయంతో దాడికి ప్లాన్ చేశాడని, సెంట్రల్ హోం మినిస్ట్రీకి ఫిర్యాదు చేయమని ఓ యూనియన్ మినిస్టర్ 36 గంటల్లో ఏడు సార్లు కాల్ చేశాడని, ఇంత జరుగుతుంటే ఫాంహౌస్ లో కేసీఆర్ నిద్రపోతున్నాడని అన్నారు. నేను డీజీపీని కలుస్తా అంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని, రెండు రోజులుగా నన్ను డీజీపీని కలువకుండా హౌస్ అరెస్ట్ చేశారని పాల్ ఆరోపించారు. నన్ను అడ్డుకోవడానికి వందలాది మంది పోలీసులను మోహరింపజేసి పబ్లిక్ మనీ వేస్ట్ చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ గుండాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ వేయబోతున్నట్లు తెలిపారు.

KA Paul: కేటీఆర్ కనుసన్నల్లోనే దాడి: కేఏ పాల్

డీజీపీ కార్యాలయం దగ్గర వెయ్యి మంది పోలీసులు నాకోసం మోహరిచారని, ఎవరూ లేనప్పుడు నన్ను ఎత్తుకుని పోవడానికి ట్రై చేస్తున్నారని ఆరోపించారు. ఖబడ్దార్ కేటీఆర్ ఎవరితో ఫైట్ చేస్తున్నావో తెలుసుకో, పది మంది డిక్టేటర్ లాంటి దేశాధినేతలను మోకరించేలా చేశాను, ముషారఫ్ నా ముందు మోకరిల్లాడు, నువ్వెంత అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని అన్నారు. 24 గంటల్లో డీజీపీ ఇక్కడికి వస్తే కలుస్తా లేదా రేపు హైకోర్టు లో లంచ్ మోషన్ వేస్తా, నా ప్రాణానికి ఏదైనా జరిగితే దానికి కేసీఆర్, కేటీఆర్ లే బాధ్యులు, నాకు ఎవరూ శత్రువులు లేరు కేసీఆర్, కేటీఆర్ తప్ప అంటూ కేపాల్ ఆగ్రహంతో మాట్లాడారు.