‘మహరాజై మురిశానే ఆకాశ దేశాన’..

‘మహరాజై మురిశానే ఆకాశ దేశాన’..

Kadhile Kaalannadiga: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తికేయ, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా.. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’, ‘ప్రతిరోజూ పండగే’, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.. కౌశిక్ పెగుళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు..

ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ అనే మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. లావణ్య నర్స్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ‘కదిలే కాలాన్నడిగా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

https://10tv.in/my-name-iju-raju-lyrical-song-from-chaavu-kaburu-challaga/

జాక్స్ బెజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. కౌశిక్ పెగుళ్లపాటి, సనారే లిరిక్స్ రాశారు.. గౌతమ్ భరద్వాజ్, షాషా తిరుపతి పాడారు.. హీరో హీరోయిన్ల మధ్య అనుబంధాన్ని తెలుపుతూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆమని, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.