కాజల్ హనీమూన్.. అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ!

  • Published By: sekhar ,Published On : December 7, 2020 / 08:16 PM IST
కాజల్ హనీమూన్.. అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ!

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ హనీమన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిందట..? స్పెషల్‌గా సెలబ్రెటీ విల్లా బుక్ చేసుకుందట..? ఇంత వరకూ ఎవరూ ఖర్చు పెట్టనంతగా కాజల్ తన హనీమూన్‌కు స్పెండ్ చేసిందట..

ఇలా కాజల్ హనీమూన్ గురించి ఎన్నో వార్తలు షికారు చేశాయి. అయితే అసలు పైసా కూడా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఖర్చు లేకుండా స్టార్ హీరోయిన్ టూర్ ఎలా సాధ్యమయ్యింది.



ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ హనీమూన్ ట్రిప్‌‌లో మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ, సముద్ర‌పు అందాల నడుమ భర్తతో తీసుకున్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇక వీరి హనీమూన్ ఖర్చుల వివరాలు చూస్తే.. ఈ జంట స్టే చేసిన ది మురక హోటల్‌లో ఉండాలంటే ఒక్క రాత్రికి 50 వేల డార్లు చెల్లించాలి. అంటే, మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా 38 లక్షల రూపాయలు.



బాలీవుడ్ మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ హోటల్‌లో కాజల్ అగర్వాల్ జంట 10 రోజులు స్టే చేసింది. దీంతో హోటల్ అద్దె, ఆహారం, ఇతర సైట్‌సీయింగ్ ఖర్చులతో కలుపుకుని మొత్తం మీద కాజల్‌కు అయిన ఖర్చు అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. అయితే కాజల్‌తో పాటు గౌతమ్ కూడా బాగా రిచ్ అవ్వడంతో ఇది వాళ్లకు పెద్ద ఖర్చు అయ్యుండదు అనుకున్నారు అంతా.. కానీ ఈ హనీమూన్ ట్రిపు కోసం.. ఆమె ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా హానీమూన్ ట్రిప్‌ను కాజల్ ఎంజాయ్ చేసినట్లు తెలిసింది.



వివరాల్లోకి వెళ్తే.. మాల్దీవుల్లో టూరిజాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలకు ఫ్రీగా పర్యటించేందుకు అక్కడి ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. సెలబ్రిటీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఈ ఆఫర్ పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాజల్‌కి 16 మిలియన్లకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె ఫ్రీగానే హనీమూన్ ట్రిప్ వేసినట్టు తెలుస్తోంది. ఇక కాజల్ తన భర్త గౌతమ్ బిజినెస్‌లో కూడా తోడుగా ఉండబోతోంది. గౌతమ్ కంపెనీ ప్రోడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. వాటితో పాటు తాను కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతోంది కాజల్ అగర్వాల్.

 

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)