Kakatiya Utsavalu : జూలై 7 నుంచి కాకతీయ ఉత్సవాలు – మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కాలం నాటి పలు ముఖ్యమైన సంప్రదాయాలు, పద్దతులు, కళలను కళ్లకు కట్టినట్టు వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. దశాబ్దాల చరిత్రను కళ్ల ముందు ఆవిష్కరించేందుకు..

Kakatiya Utsavalu : జూలై 7 నుంచి కాకతీయ ఉత్సవాలు – మంత్రి శ్రీనివాస్ గౌడ్

Kakatiya Utsavalu

Kakatiya Utsavalu : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి సీఎం కేసీఆర్ కు వరంగల్ జిల్లాపై ప్రేమ ఎక్కువ అని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతి పెద్ద నగరంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వరంగల్ లో పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనేక పరిశ్రమలను వరంగల్ కు తెచ్చేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

కాకతీయుల పాలన, వారి కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసీఆర్ సంకల్పించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాకతీయులకు ఇష్టమైన, సెంటిమెంట్ గా భావించే 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 7వ నెల 7వ తేదీ నుంచి కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తామని, దానికి సంబంధించి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. వారోత్సవాల నిర్వహణ ఏర్పాట్ల కోసం సన్నాహాలు చేసేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాకతీయుల కాలం నుంచి ఘనమైన చరిత్ర కలిగిన నగరం వరంగల్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గొలుసుకట్టు చెరువుల్లో సాగు తాగు నీటి సమస్య లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఘనత కాకతీయుల సామ్రాజ్యానికి సొంతం అన్నారు. వారం పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

ఈ ఉత్సవాలకు బస్తర్‌లో ఉన్న కాకతీయుల వారసుడు కమల్ చంద్ వాసుదేవ్ ను(22వ కాకతీయ వంశ రాజు) ఆహ్వానిస్తామని వినయ్ భాస్కర్ తెలిపారు. కాకతీయ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కాలం నాటి పలు ముఖ్యమైన సంప్రదాయాలు, పద్దతులు, కళలను కళ్లకు కట్టినట్టు వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. దశాబ్దాల చరిత్రను కళ్ల ముందు ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు

హనుమకొండ హరిత కాకతీయ హోటల్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అధికారులు హాజరయ్యారు.