Kaleshwaram Project : జాతీయ హోదా కల్పించలేము.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం ప్రకటించింది. కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదని స్పష్టం చేసింది.(Kaleshwaram Project)

Kaleshwaram Project : జాతీయ హోదా కల్పించలేము.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

Kaleshwaram

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం ప్రకటించింది. కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదని స్పష్టం చేసింది. కాళేశ్వరంకు పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. జాతీయ ప్రాజెక్టు పథకం కింద చేర్చడానికి కాళేశ్వరంకు అర్హత లేదంది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ అడ్వైజరీ కమిటీ ఆమోదం కూడా ఉండాలంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి కూడా తీసుకోవాలంది. ఈ అనుమతులేమీ తెలంగాణ తీసుకోలేదని తన సమాధానంలో కేంద్ర మంత్రి చెప్పారు. అనుమతులన్నీ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలన్నారు. హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే.. కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ 2016 ఫిబ్రవరి, 2018 డిసెంబర్ లో ప్రధానికి లేఖలు రాసినట్లు కేంద్రం తెలిపింది.

Kaleswaram : భారీ వరదలకు నీట మునిగిన కాళేశ్వరం పంప్ హౌజ్‌లు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో వేసిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ నుండి లిఖిత పూర్వకంగా ఈ విషయమై సమాధానం వచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని నీటి పారుదల ప్రాజెక్టులున్నాయి, కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల ఆదేశాలను రెండు రాష్ట్రాలు పాటిస్తున్నాయా? కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం నుండి ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కోరారా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ అధికారులను కోరారు.(Kaleshwaram Project)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదాను ఇచ్చింది. కానీ కాళేశ్వరానికి మాత్రం జాతీయ హోదా ఇవ్వలేదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పలుమార్లు కోరింది. మరోవైపు కాళేశ్వరం కాకపోతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలనే డిమాడ్ కూడా తెలంగాణ నుండి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ నుండి ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదాను కల్పించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించేందుకు అర్హతే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. కాళేశ్వరం విషయంలో కేంద్రం చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.(Kaleshwaram Project)