Kalyan Ram Upcoming Movie: మైత్రీ మూవీ అయినా కళ్యాణ్ రామ్ కు సక్సెస్ ఇచ్చేనా?

నందమూరి హీరోలలో తమ్ముడు ఎన్టీఆర్ ఓ రేంజిలో దూసుకుపోతుంటే అన్న కళ్యాణ్ రామ్ మాత్రం వెనకపడిపోతున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ తప్ప కళ్యాణ్ రామ్ ఖాతాలో భారీ హిట్స్ లేవు. పూరి జగన్నాధ్ ఇజం, కేవీ గుహన్ థ్రిల్లర్ 118 పర్వాలేదనిపించినా నందమూరి క్రేజ్ కు అవి చాలా తక్కువే. కాగా.. కళ్యాణ్ రామ్ ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

Kalyan Ram Upcoming Movie: మైత్రీ మూవీ అయినా కళ్యాణ్ రామ్ కు సక్సెస్ ఇచ్చేనా?

Kalyan Ram Upcoming Movie

Kalyan Ram Upcoming Movie: నందమూరి హీరోలలో తమ్ముడు ఎన్టీఆర్ ఓ రేంజిలో దూసుకుపోతుంటే అన్న కళ్యాణ్ రామ్ మాత్రం వెనకపడిపోతున్నాడు. సినిమాకో మెట్టు ఎదుగుతూ జూనియర్ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంటే.. కళ్యాణ్ రామ్ వైపు సక్సెస్ మొహం చాటేస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ తప్ప కళ్యాణ్ రామ్ ఖాతాలో భారీ హిట్స్ లేవు. పూరి జగన్నాధ్ ఇజం, కేవీ గుహన్ థ్రిల్లర్ 118 పర్వాలేదనిపించినా నందమూరి క్రేజ్ కు అవి చాలా తక్కువే. శర్వానంద్ కు శతమానం భవతీ లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చిన దర్శకుడు సతీష్ వేగ్నేష్ కూడా కళ్యాణ్ రామ్ ను ఎంతో మంచివాడిగా చూపించాడే కానీ సక్సెస్ హీరోగా మాత్రం నిరూపించలేకపోయాడు.

కాగా.. కళ్యాణ్ రామ్ ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ సినిమా చేస్తున్నాడు. రాజేంద్ర అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరు. ఈ నిర్మాతలు ఒక కథను ఒకే చేశారంటే అందులో సినిమాను విజయతీరాలకు చేర్చే అంశాలు ఏవో ప్రత్యేకంగా ఉంటాయని పేరుంది. అలాంటిది కొత్త దర్శకుడి కథను ఒకే చేసి మరీ ఈ సినిమాను అట్టహాసంగా ప్రారంభించారంటే ఈ కథలో ఏదో ఉందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

ఫిబ్రవరిలో లాంఛనంగా మొదలైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా ఈ సినిమాలో కళ్యాణ్ డబుల్ రోల్ తో పాటు షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కథకు తగ్గట్లుగా కళ్యాణ్ లుక్ కోసమే రెండు నెలల సమయం పట్టినట్లుగా చెప్తున్నారు. ఏది ఏమైనా కళ్యాణ్ కు సరైన హిట్ దక్కి ఏళ్ళు గడుస్తుండగా నందమూరి అభిమానులు ఆకలి మీద ఉన్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ అయినా తన పేరుకు తగ్గట్లుగా కళ్యాణ్ కు సక్సెస్ అందిస్తారా అన్నది చూడాలి. అన్నట్లు ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.