Amigos : శేఖర్ కమ్ముల టైటిల్ వాడేసిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాకి పేరు ఎలా పెట్టారో తెలుసా??

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నా ప్రతి సినిమాకి టైటిల్ విషయంలో తప్పు జరగకూడదు అని భావిస్తాను. ఈ సినిమాలో నేను చేసే మూడు పాత్రలు ముఖ్యమైనవే. ఆ పాత్రల్లోని ఏదో ఒక పేరు టైటిల్ గా పెట్టలేం. సినిమాలో................

Amigos :  నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో చాలా రోజుల తర్వాత భారీ విజయం సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు అమిగోస్ సినిమాతో రాబోతున్నాడు. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు ఈ సినిమాలో. కన్నడ భామ యషికా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త దర్శకుడు రాజేంద్ర దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఈ సినిమాపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అమిగోస్ లో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు చేయడం, అందులో ఒకటి విలన్ రోల్ అవ్వడం, బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి గాని.. పాటని రీమిక్స్ చేయడం, ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రావడం.. ఇవన్నీ సినిమాపై హైప్ పెంచేశాయి. ఇక చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సినిమా టైటిల్ అమిగోస్ అని ప్రకటించినప్పటి నుంచి కొత్తగా ఉందే అని అంతా అనుకున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఈ టైటిల్ గురించి చెప్పాడు.

Rashmika : రోజు వారి డైరీ బయటపెట్టిన రష్మిక.. అతన్ని ఎందుకు కలుస్తుంది? ఆందోళనలో అభిమానులు..

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నా ప్రతి సినిమాకి టైటిల్ విషయంలో తప్పు జరగకూడదు అని భావిస్తాను. ఈ సినిమాలో నేను చేసే మూడు పాత్రలు ముఖ్యమైనవే. ఆ పాత్రల్లోని ఏదో ఒక పేరు టైటిల్ గా పెట్టలేం. సినిమాలో వాళ్ళు స్నేహితులు కాబట్టి ముగ్గురు మిత్రులు, స్నేహం అనే రొటీన్ పేర్లు పెట్టలేం. అందుకే స్నేహితులు అనే పదం అర్ధం వచ్చేలా వేరే భాషల్లో ఉన్న పదాలని వెతికాం. అప్పుడు అమిగోస్ అనే పదం తగిలింది. స్పానిష్ లో అమిగోస్ అంటే స్నేహితులు అని అర్ధం. అలాగే శేఖర్ కమ్ముల బ్యానర్ పేరు కూడా అమిగోస్ అని తెలిసింది. ఈ పదం క్యాచీగా, కొత్తగా ఉందని తీసుకున్నాం. మొదట్లో ఈ పేరుకు అర్ధం ఎవరికీ తెలియలేదు, కానీ మేము అందరికి తెలిసేలా చేశాం అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు