Kalyanam Kamaneeyam: ఫిబ్రవరి 10న ఓటీటీలో రెండు తెలుగు సినిమాలు..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రాలను వీలైనంత త్వరగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఓటీటీ నిర్వాహకులు ప్రయత్ని్స్తున్నారు. ఈ క్రమంలోనే బడా స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని, చిన్న సినిమాల వరకు ఓటీటీలో వీలైనంత త్వరగా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి.

Kalyanam Kamaneeyam: ఫిబ్రవరి 10న ఓటీటీలో రెండు తెలుగు సినిమాలు..!

Kalyanam Kamaneeyam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రాలను వీలైనంత త్వరగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఓటీటీ నిర్వాహకులు ప్రయత్ని్స్తున్నారు. ఈ క్రమంలోనే బడా స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని, చిన్న సినిమాల వరకు ఓటీటీలో వీలైనంత త్వరగా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి.

Kalyanam Kamaneeyam: కళ్యాణం కమనీయం.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్!

ఇక తాజాగా థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలను కూడా త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు చిత్ర మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయ్యాయి. యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ ‘హంట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాతో పాటు మరో సినిమా ‘కళ్యాణం కమనీయం’ కూడా థియేటర్స్‌లో సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఆహాలో ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఒకేరోజున రెండు తెలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో ప్రేక్షకులు ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.