Pushpaka Vimanam : ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ కోసం సమంత..

‘పుష్పక విమానం’ సినిమాలోని ‘కళ్యాణం’ పాటను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేయనున్నారు..

Pushpaka Vimanam : ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ కోసం సమంత..

Pushpaka Vimanam

Pushpaka Vimanam: ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పుష్పక విమానం’. గీత్ సైని కథానాయిక. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి విజయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ‘సిలకా’.. అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. యూత్‌ను, మాస్‌ను ఆకట్టుకున్న ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్.

‘కళ్యాణం’ లిరికల్ సాంగ్ ఈ నెల 18న శుక్రవారం ఉదయం 11 గంటలకు స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా వచ్చే ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, సిద్ శ్రీరామ్, మంగ్లీ పాడారు. రామ్ మిరియాల సంగీతం ‘పుష్పక విమానం’కు ఓ అస్సెట్ కాబోతోంది.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ ,గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు..

టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, సినిమాటోగ్రఫీ : హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్ : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు : గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి రచన-దర్శకత్వం: దామోదర..