TTD: అమెరికాలో ఈ నెల 18 నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు

ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో భారీ ఎత్తున శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమెరికాలోని ఏడు నగరాల్లో కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు.

TTD:  అమెరికాలో ఈ నెల 18 నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు

Ttd

TTD: ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో భారీ ఎత్తున శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమెరికాలోని ఏడు నగరాల్లో కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం తిరుమల నుంచి స్వామి వారు, అమ్మవార్ల విగ్రహాలను తీసుకెళ్లనున్నారు. అలాగే అర్చకులు కూడా అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కల్యాణోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డీసీ, 9న అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు.

Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత

అమెరికాలో ఉండే భక్తులు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉండే హిందువులు, తెలుగు భక్తుల కోసం ఏపీ ఎన్నార్టీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సుబ్బారెడ్డి చెప్పారు. తమ దేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని యూకే, దుబాయ్, కెనడా వంటి దేశాల్లో ఉన్న భక్తుల నుంచి కూడా వినతులు అందుతున్నాయని, వీటిపై పరిశీలన జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.