Vikram: విక్రమ్ 4 రోజులు కలెక్షన్స్.. కమల్ ఏమాత్రం తగ్గడం లేదుగా!

ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది...

Vikram: విక్రమ్ 4 రోజులు కలెక్షన్స్.. కమల్ ఏమాత్రం తగ్గడం లేదుగా!

Kamal Haasan Vikram 4 Days Collections

Vikram: ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించగా, ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Vikram : కమల్ హాసన్ అన్న.. సూర్య తంబి.. స్పెషల్ ట్వీట్..

ఈ సినిమాలో కమల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ఆయన అభిమానులు పట్టం కడుతున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయగా, అన్ని భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇక తెలుగునాట విక్రమ్ సినిమా తన సత్తా చాటుతోంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు పూర్తవగా.. తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ చిత్రం రూ.7.90 కోట్లు షేర్ వసూళ్లు సాధించింది.

Vikram: ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్ అంటున్నతమిళ హీరో

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.188.51 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కమల్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో కమల్ అదిరిపోయే హిట్ కొట్టాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో హీరో సూర్య ఓ పవర్‌ప్యాక్డ్ పాత్రలో సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా 4 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 3.12 కోట్లు
సీడెడ్ – 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.13 కోట్లు
ఈస్ట్ – 0.67 కోట్లు
వెస్ట్ – 0.45 కోట్లు
గుంటూరు – 0.57 కోట్లు
కృష్ణా – 0.55 కోట్లు
నెల్లూరు – 0.34 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.7.90 కోట్లు (రూ.14.56 కోట్లు గ్రాస్)
తమిళనాడు – 73.60 కోట్లు (గ్రాస్)
కర్ణాటక – 13.30 కోట్లు (గ్రాస్)
కేరళ – 17.85 కోట్లు (గ్రాస్)
రెస్టాఫ్ ఇండియా – 3.05 కోట్లు (గ్రాస్)
ఓవర్సీస్ – 66.15 కోట్లు (గ్రాస్)
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 188.51 కోట్లు (గ్రాస్)