Kanabadutaledu : సునీల్ ‘కనబడుటలేదు’..!

‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. డిటెక్టివ్స్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ సునీల్ చెప్పిన డైలాగ్‌ ఆసక్తికరంగా అనిపిస్తుంది..

Kanabadutaledu : సునీల్ ‘కనబడుటలేదు’..!

Kanabadutaledu

Kanabadutaledu: టాలీవుడ్ పాపులర్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ‘కనబడుటలేదు’ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి నిజంగా ‘భీమవరం బుల్లోడు’ సునీల్ ‘కనబడటం లేదా’ అనుకుంటున్నారా..? కంగారు పడకండీ.. ‘కనబడుటలేదు’ అనేది సునీల్ కీ క్యారెక్టర్ చేస్తున్న సినిమా టైటిల్.

ఎం.బాలరాజు డైరెక్ట్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. ‘కనబడుటలేదు’.. వైశాలి రాజ్, సుక్రాంత్ వీరెల్ల, హిమజ, ప్రవీణ్, రవివర్మ, ‘కంచరపాలెం’ కిషోర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ‘నచ్చావులే’ ఫేం శ్రీదివ్య ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి, టీంకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. మూవీ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది టీజర్..

‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. డిటెక్టివ్స్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ సునీల్ చెప్పిన డైలాగ్‌ ఆసక్తికరంగా అనిపిస్తుంది. డిటెక్టివ్ క్యారెక్టర్‌లో సునీల్ సరికొత్తగా కనిపిస్తున్నారు. సందీప్ బద్దుల విజువల్స్, మధు పొన్నాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్ కు హైలెట్ అయ్యాయి. త్వరలో ‘కనబడుటలేదు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.