Kangana Ranaut : కంగనాకు ఈసారి ఇన్‌స్టాగ్రామ్ షాకిచ్చింది..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిన సంగతి మర్చిపోకముందే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా షాకిచ్చింది.. కంగనా చేసిన ఓ పోస్ట్ కారణంగా మండిపడ్డ ఇన్‌స్టా అమ్మడి పోస్టును డిలీట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది..

Kangana Ranaut : కంగనాకు ఈసారి ఇన్‌స్టాగ్రామ్ షాకిచ్చింది..

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అయినా, నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నా సరే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటుంది.. ఆమె ముక్కుసూటితనానికి, కంగనా ప్రవర్తనకు బాలీవుడ్ సెలబ్రిటీలే సైలెంట్ అయిపోతారు..

కొద్దిరోజుల క్రితమే ఆమె ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిన సంగతి మర్చిపోకముందే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా షాకిచ్చింది.. కంగనా చేసిన ఓ పోస్ట్ కారణంగా మండిపడ్డ ఇన్‌స్టా అమ్మడి పోస్టును డిలీట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది..

ఈమధ్య కరోనా బారినపడ్డ కంగనా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో కోవిడ్-19 అనేది ఒక చిన్న ఫ్లూ లాంటిదని చెబుతూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుందంటూ తన పోస్టును ఇన్‌స్టా వారు డిలీట్ చేసేశారు. దీంతో ఎప్పటిలానే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇన్‌స్టా వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.. దీంతో నెటిజన్లు ఆమె చేసిన ఫేక్ పోస్ట్ గురించి తిట్టిపోస్తున్నారు.