కూల్‌గా ‘Koo’ యాప్‌కు మారిన కంగనా!

కూల్‌గా ‘Koo’ యాప్‌కు మారిన కంగనా!

Kangana Ranaut homegrown app Koo : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తన ట్వీట్లను మరోసారి డిలీట్ చేస్తే.. ట్విట్టర్ నుంచి వైదొలగుతానంటూ కౌంటర్ ఇచ్చింది.

ట్విట్టర్ టైమ్ అయిపోందంటూ.. ఇప్పుడంతా స్వదేశీ యాప్ కూ (Koo) యాప్ కు మారే సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేసింది. అతి త్వరలోనే తన కూ యాప్ అకౌంట్ వివరాలను వెల్లడిస్తానని చెప్పకొచ్చింది. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ‘కూ’ యాప్‌లో చేరినందుకు చాలా థ్రిల్లింగ్ ఉందని తెలిపింది.


ట్విటర్‌కే కాదు వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలో దేశీయ యాప్స్‌ రూపొందిస్తున్నారు. ట్విటర్‌కు ప్రత్యామ్నాయం ‘కూ’ రాగా, వాట్సాప్‌కు పోటీగా సందేశ్ అనే యాప్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ స్వదేశీ యాప్ ను రాజకీయ ప్రముఖులు వినియోగించడం ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూశ్‌ గోయల్ వంటి వారు కూలో చేరారు.