Emergency: మెగాఫోన్ పట్టనున్న కంగనా.. ఈసారి ‘ఇందిరా’ అవతారం!

హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. అసలే ఇప్పుడు భద్రకాళిగా ప్రతి అంశంలో విరుచుకుపడుతున్న కంగనా సినిమాల ఎంపికలో కూడా అదే డెడికేషన్ చూపిస్తుంది. కంగనా ఇప్పటికే మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్‌ల్లో నటించగా..

Emergency: మెగాఫోన్ పట్టనున్న కంగనా.. ఈసారి ‘ఇందిరా’ అవతారం!

Emergency

Emergency: హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. అసలే ఇప్పుడు భద్రకాళిగా ప్రతి అంశంలో విరుచుకుపడుతున్న కంగనా సినిమాల ఎంపికలో కూడా అదే డెడికేషన్ చూపిస్తుంది. కంగనా ఇప్పటికే మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్‌ల్లో నటించగా.. తాజాగా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బాడీ స్కానింగ్‌, ఫేస్‌ స్కానింగ్‌తో పాటు ప్రోస్థెటిక్‌ మేకప్‌ ట్రైల్స్ కూడా పూర్తి కాగా దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌, ఓ వీడియో కూడా విడుదల చేసింది.

ఇప్పటికే తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో టైటిల్‌ రోల్‌ చేసి బెంచ్ మార్క్ సెట్ చేసిన కంగనా ఇప్పుడు ఇందిరాగాంధీ పాత్రకు సాహసించడంపై ప్రశంసలు వస్తున్నాయి. ఎమర్జెన్సీ పేరుతో తెరకెక్కే ఈ సినిమా టైటిల్ తో భారీ హైప్ సొంత చేసుకోగా ఇందిరా గాంధీ కథ ఆధారంగా ఈ సినిమా సిద్ధంకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవగా దర్శకత్వంతో పాటు ఇందిరా గాంధీ పాత్రను కంగన పోషించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ‘మణికర్ణిక’ చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కంగనా ఎమర్జెన్సీ కోసం నిర్మాతగానే కాకుండా మరోసారి మెగాఫోన్ పట్టనుంది. ఈ సినిమాను తనకంటే మరెవరూ గొప్పగా డైరెక్ట్‌ చేయలేరని ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేసిన కంగనా ఈ క్రమంలో నటిగా కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వచ్చినా.. వాటిని పట్టించుకోనని చెప్పింది. నిజానికి ఈ సినిమా ఇందిరా గాంధీ బయోపిక్‌ కాదట. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ‘ఎమర్జెన్సీ అండ్‌ ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ‘ఎమర్జెన్సీ’ కాకుండా కంగన ‘ధాకడ్‌’, ‘తేజస్‌’, ‘అపరాజిత అయోధ్య’ సినిమాలు కూడా చేస్తుంది.