Sanchari Vijay : నటుడు సంచారి విజయ్ మృతి..

కన్నడ యువ నటుడు సంచారి విజయ్ (38) బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ సోమవారం(జూన్ 14) కన్నుమూశారు..

Sanchari Vijay : నటుడు సంచారి విజయ్ మృతి..

Sanchari Vijay

Sanchari Vijay: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.. ఈ కోవిడ్ టైం లో ప్రముఖులు చనిపోతే కనీసం చివరిచూపుకి కూడా నోచుకోలేని దుస్థితి ఏర్పడింది.. తాజాగా ఓ యువనటుడు మృతి చెందడంతో శాండల్ వుడ్‌లో విషాదం నెలకొంది..

కన్నడ యువ నటుడు సంచారి విజయ్ (38) బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ సోమవారం(జూన్ 14) కన్నుమూశారు. జూన్ 12వ తేది రాత్రి స్నేహితుడి ఇంటి నుండి టూవీలర్‌పై తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యారు విజయ్. తీవ్ర గాయాలపాలయిన విజయ్‌ను ఆసుపత్రిలో చేర్పించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు.. చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన అవయవాలను డొనేట్ చెయ్యనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

సంచారి విజయ్.. తన అద్భుతమైన నటనతో తక్కువ సయమంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో ‘రంగప్ప హోగ్బిన్తా’ మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘రామ రామ రఘు రామ’, ‘దశవల’, ‘హరివు’, ‘నాను అవనల్ల అవలు’, ‘కిల్లింగ్ వీరప్పన్’ ‘సిపాయి’, ‘యాక్ట్ 1978’ వంటి పలు సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. ‘నాను అవనల్ల అవలు’ సినిమాకు గాను ఉత్తమనటుడిగా నేషనల్ అవార్డ్, కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డ్, బెస్ట్ యాక్టర్‌గా సౌత్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు సంచారి విజయ్.