రామమందిరం కోసం..80 ఏళ్ల మహిళ 28 ఏళ్లుగా రోజూ రూ.5 దాచిపెట్టి..విరాళంగా..

రామమందిరం కోసం..80 ఏళ్ల మహిళ 28 ఏళ్లుగా రోజూ రూ.5 దాచిపెట్టి..విరాళంగా..

Ayodhya Ram temple 80 years woman donate: అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం కోసం ఎంతోమంది వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఓ శుభముహూర్తాన భూమిపూజ జరిగి..నిర్మాణం కొనసాగుతున్న క్రమంలో ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. ఎవరికి తోచిన విరాళాలు వారు ఇస్తున్నారు. కానీ 80 ఏళ్ల మహిళ ఇచ్చిన విరాళం గురించి మాత్రం ప్రత్యేకించి చెప్పుకోవాలి. చాలామంది విరాళాలు వారికి కలిగినదాంట్లోంచి ఇస్తారు. చాలా తక్కువమంది మాత్రం విరాళం ఇవ్వటం బాధ్యతగా కాకుండా భక్తిగా..అంకిత భావంతో ఇస్తారు. అటువంటి మహిళే కాన్పూరుకు చెందిన కృష్ణ దీక్షిత్ అనే 80 ఏళ్ల మహిళ..

ఉత్తరప్రదేశ్… కాన్పూర్‌కి చెందిన 80 ఏళ్ల బామ్మ కృష్ణ దీక్షిత్… అయోధ్య రామాలయ నిర్మాణం కోసం తప్పించిపోయారు. రామమందిరాన్ని కళ్లారా చూడాలని ఎంతగానో ఆకాంక్షించారు. రామమందిర నిర్మాణం కోసం గత 28 ఏళ్లుగా రోజుకు రూ.5లు చొప్పున పక్కనపెడుతూ వచ్చారు. అలా ఇప్పటికి రూ.51,000 అయ్యింది. దాన్ని కృష్ణ దీక్షిత విరాళంగా ఇచ్చారు. దీన్ని బట్టీ చూస్తే ఆమె రామమందిర నిర్మాణం జరగాలని ఎంతగా ఆకాంక్షించాలరో అర్థం చేసుకోవచ్చు..

దీని గురించి కృష్ణ దీక్షిత్ మాట్లాడుతూ..” రామమందిరాన్ని కళ్లారా చూడాలని ఎంతగా ఆశిస్తున్నాను. ఆ శ్రీరామ చంద్రడి ఆలయం కోసం నావంతుగా ఏమన్నా చేయాలని అనుకున్నాను. అలా ప్రతీరోజూ క్రమం తప్పకుండా ఓ రూ.5 పక్కనపెడుతూ వచ్చాను. రాముడి ఆలయ నిర్మాణంలో నా వంతు పాత్ర కూడా ఉండాలని ఆశపడ్డాను. అందుకే రోజుకు రూ.5లు పొదుపుచేశాను. 1992 నుంచి ఆమె ఇలా డబ్బు దాస్తూ వచ్చాను. అలా ఐదు ఐదు రూపాయలు రూ.51 వేలు అయ్యాయి. వాటిని రామమందిర నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చానని తెలిపారు. కాన్పూర్‌లోని… యశోదా నగర్‌లో ఉంటున్న కృష్ణ దీక్షిత్… కొన్ని రోజుల క్రితం RSS ప్రాంతీయ ప్రచారకులకు తన విరాళాన్ని అందజేశారు.

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్… జనవరి 15 నుంచి విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి కనీసం రూ.10 విరాళాల రూపంలో పొందేలా కార్యక్రమం అమలు చేస్తోంది. ఇది ఫిబ్రవరి 27 వరకూ ఈ సేకరణ కొనసాగుతుందని ట్రస్ట్ చెప్పింది. ఇలా అందరూ డబ్బు ఇవ్వడం ద్వారా… ఆలయ నిర్మాణంలో అందరూ పాలు పంచుకున్నట్లు అవుతుందన్నది ట్రస్ట్ ఆలోచన. కానీ విరాళాలు ఇవ్వడం తప్పనిసరి కాదు.వారి వారి ఇష్టప్రకారమే..

కాగా..రూ.20వేలకు మించి నగదు రూపంలో విరాళాలను ట్రస్ట్ స్వీకరించదు. అందుకోసం కృష్ణ దీక్షిత్ పొదుపు చేసిన రూ.50వేలను ఆమె కుమారుడు గౌరంగ్ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసి..అనంతరం దాన్ని చెక్ రూపంలో విరాళంగా అందజేశారావిడ. కృష్ణ దీక్షిత్ తో పాటు ఆమె కుటుంబం మొత్తం కలిపి రూ.1,30,000 విరాళంగా ఇచ్చారు. ఇందులో ఆమె మనవడు నమిత్ దీక్షిత్… మొదటి నెల జీతాన్ని సంవత్సరం క్రితం అలాగే ఉంచి ఇప్పుడు నానమ్మ విరాళంతో పాటు కలిసి ఇచ్చారు.