చైనా అధ్యక్షుడికి అంత్యక్రియలు చేసిన కాన్పూర్ వాసులు

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 05:34 AM IST
చైనా అధ్యక్షుడికి అంత్యక్రియలు చేసిన కాన్పూర్ వాసులు

చైనాపై మాట ఎత్తితే ఒంటి కాలిపై లేస్తున్నారు భారతదేశ వాసులు. 20 మంది భారతీయ సైనికుల పొట్టన పెట్టుకున్న చైనా సైనికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పరోక్షంగా యుద్ధం ప్రకటిస్తున్నారు కొందరు. కేంద్రం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఆర్థికంగా దెబ్బ తీయాలని కొంతమంది ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.

చైనా వస్తువులను బ్యాన్ చేయాలని, బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. కొంతమందైతే..ఏకంగా చైనా వస్తువులను పగులగొట్టడం, కాల్చేయడం వంటివి చేస్తున్నారు. చైనా జెండా, అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన కొంతమంది చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

2020, జూన్ 18వ తేదీన కాన్పూర్ వాసులు జిన్ పింగ్ ఫొటోతో శవపేటికగా తయారు చేశారు. గడ్డి, ఓ షర్టు దానిపై పరిచారు. పూల దండలు పెట్టారు. శవపేటిక వద్ద చైనా జెండాను పెట్టారు. నలుగురు వ్యక్తులు పాడెను మోశారు. మరొక వ్యక్తి పొగ వస్తున్న కుండను పట్టుకుని ముందుకు కదిలాడు. ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై భారత్ మాతాకీ జై అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. చివరకు ఓ కాల్వలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే. అయితే మన జవాన్లపై దాడికి చైనా లాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది.

భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్‌-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. 

 

Read: ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య