Kantara: తెలుగులో కాంతార కళ్లుచెదిరే ఫీట్.. ఏకంగా పాతిక!

కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రిషబ్ స్వయంగా డైరెక్ట్ చేయగా, తుళునాడులోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన సంప్రదాయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు చిత్ర యూనిట్. ఇక ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న స్టోరీలైన్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోగా, ఆయన పర్ఫార్మెన్స్ వారికి పూనకాలు తెప్పించింది.

Kantara: తెలుగులో కాంతార కళ్లుచెదిరే ఫీట్.. ఏకంగా పాతిక!

Kantara Collects Rs 25 Cr Share In Telugu States

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రిషబ్ స్వయంగా డైరెక్ట్ చేయగా, తుళునాడులోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన సంప్రదాయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు చిత్ర యూనిట్. ఇక ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న స్టోరీలైన్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోగా, ఆయన పర్ఫార్మెన్స్ వారికి పూనకాలు తెప్పించింది.

Kantara: కర్ణాటకలో ‘కాంతార’ సెన్సేషనల్ రికార్డు.. ఏకంగా కోటి టికెట్లు!

ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు భాషాభేదం లేకుండా థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వారు రిలీజ్ చేయగా వారికి ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.25 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించిందంటే, ఈ సినిమాకు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు.

Kantara: పుష్ప కలెక్షన్లు కొల్లగొట్టిన కాంతార..

కాగా, ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా పట్టం కడుతున్నారు. అక్కడ కూడా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే కాంతార చిత్రం ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 400 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతోంది. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లను రాబడుతుందో చూడాలి.