Kantara: అఫీషియల్.. ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న కాంతార!

కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా, ఎవరి అంచనాలకు కూడా అందని విధంగా ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది.

Kantara: అఫీషియల్.. ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న కాంతార!

Kantara Locks OTT Release Date

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా, ఎవరి అంచనాలకు కూడా అందని విధంగా ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేసిన విధానం కూడా సూపర్బ్ అంటూ ప్రేక్షకులు ఆయన్న పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Kantara: తెలుగులో కాంతార కళ్లుచెదిరే ఫీట్.. ఏకంగా పాతిక!

సినిమాకు అన్ని వర్గాలు ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లు క్యూ కట్టారు. కాగా, ఈ సినిమాను గత నెలలోనే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో ఈ సినిమాను ఓటీటీలో అప్పుడే రిలీజ్ చేయొద్దంటూ ఓటీటీ నిర్వాహకులను చిత్ర నిర్మాతలు రిక్వెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవుతోంది.

Kantara: పుష్ప కలెక్షన్లు కొల్లగొట్టిన కాంతార..

ఈ సినిమాను నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక దక్షిణాది భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా, అంజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.